Happy Birthday Rajinikanth: ఒక్కో సినిమాకు రజనీ కాంత్ ఎన్ని కోట్లు తీసుకుంటారో తెలుసా?.. ఫ్లాప్ అయితే మాత్రం!!
రజనీ కాంత్ తాను చేసే ఒక్కో సినిమాకు 50-60 కోట్లు తీసుకుంటారట. అయితే ఒకవేళ తన సినిమా ఏదైనా ఫ్లాప్ అయితే మాత్రం సూపర్ స్టార్ తన ఫీజును నిర్మాతకే తిరిగి ఇచ్చేస్తాడట.
Rajnikanth charges 50-60 Crores remuneration for a movie: రజనీ కాంత్ (Rajnikanth).. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. తనదైన మ్యానరిజం, స్టైల్‌తో భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. కండక్టర్ నుంచి సూపర్ స్టార్ (Superstar )గా ఎదిగిన ఆయనకు భారత్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా ఉండదు. రజనీ సినిమా రిలీజ్ అవుతుందంటే.. అభిమానులకు పండగే అని చెప్పాలి. సినిమా రిలీజ్ రోజు థియేటర్ మొత్తం ఈలలు, గోలులతో దద్దరిల్లిపోతుంటుంది. మంచికి మారుపేరైన 'తలైవా' బర్త్‌డే నేడు (డిసెంబర్ 12). ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు (Happy BirthDay Rajinikanth) వెల్లువెత్తున్నాయి. పుట్టిన రోజు సందర్భంగా ఒక్కో సినిమాకు రజనీ కాంత్ ఎన్ని కోట్లు తీసుకుంటారో ఓసారి చూద్దాం.
70 ఏళ్ల వయసులో కూడా రజనీ కాంత్ (Rajnikanth) యువ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. అజిత్, విజయ్, విక్రమ్, సూర్య, ధనుష్, కార్తీ, విజయ్ సేతుపతి లాంటి హీరోలకు ధీటుగా రజనీ వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. తమిళ పరిశ్రమలో ప్రస్తుతం ఉన్న అగ్ర హీరోలలో అత్యధిక రెమ్యునరేషన్ (Remuneration ) తీసుకుంటున్న హీరో రజనీనే. కక్నాలెడ్జ్ నివేదిక ప్రకారం.. రజనీ కాంత్ తాను చేసే ఒక్కో సినిమాకు 50-60 కోట్లు తీసుకుంటారట. అయితే ఒకవేళ తన సినిమా ఏదైనా ఫ్లాప్ అయితే మాత్రం సూపర్ స్టార్ తన ఫీజును నిర్మాతకే తిరిగి ఇచ్చేస్తాడట. రజనీ ఇటీవల నటించిన 'అన్నాత్తై' సినిమా తమిళ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఇదే సినిమా తెలుగులో 'పెద్దన్న'గా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
Also Read: Manchu Vishnu: మంచు విష్ణు కీలక నిర్ణయం-ప్రకాష్ రాజ్ ప్యానెల్ రాజీనామాలు ఆమోదం
సూపర్ స్టార్ రజనీ కాంత్ (Rajnikanth) సినిమాల ద్వారా బాగానే సంపాదించారు. అత్యధికంగా సంపాదిస్తున్న తారల జాబితాలో రజనీ ఎప్పుడో చేరిపోయారు. కోట్లలో పారితోషికం తీసుకుంటూ దివంగత నటుడు ఎంజీఆర్ (MGR) తర్వాత స్థానంలో ఉన్నారు రజనీ. రజనీ నికర విలువ దాదాపుగా 365 కోట్లు. ఇదంతా ఆయన సినిమాల ద్వారా మాత్రమే సంపాదించారు. సూపర్ స్టార్ కమర్షియల్ యాడ్స్ చేయడనే విషయం తెలిసిందే. ఏదైనా మంచి పని చేయడంలో కూడా ముందుంటారు. పేద ప్రజలు, ఛారిటీల నాకోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు. అయితే ఇదంతా ఆయన బయటికి చెప్పుకోరు. ఇక రజనీ 100-120 కోట్ల రూపాయల పెట్టుబడిని కలిగి ఉన్నారట.
రజనీ కాంత్ (Rajnikanth)కి చెన్నైలో అందమైన ఇల్లు ఉంది. రజనీ ఇల్లు చాలా విలాసవంతమైనది. అయితే ఆ ఇళ్లు మాత్రం చాలా పురాతన వస్తువులతో అలంకరించి ఉంటుంది. మిగతా స్టార్స్ మాదిరిగా రజనీకి 10 లగ్జరీ వాహనాలు లేవు. ఉన్నవి 3 వాహనాలు మాత్రమే. టయోటా ఇన్నోవా, రేంజ్ రోవర్, బెంట్లీ ఆయన గ్యారేజిలో ఉన్నాయి. 1950 డిసెంబర్ 12న మరాఠి కుటుంబంలో పుట్టిన రజనీ.. 1975లో వచ్చిన అపూర్వ రాగంగళ్ అనే తమిళ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఆ తర్వాత తమిళ, తెలుగు, కన్నడ, బాలీవుడ్ చిత్రాలకు పనిచేశారు. రజనీ కాంత్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా లభించింది.
Also Read: Massive Fire Accident: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం...27 ఇళ్లు, 26 గోశాలలు దగ్ధం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook