NTR 30 మళ్లీ వాయిదా.. దెబ్బ మీద దెబ్బ.. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
Koratala Siva NTR 30 కొరటాల శివ ఎన్టీఆర్ కాంబోలో రావాల్సిన కొత్త సినిమా అప్డేట్ల కోసంయంగ్ టైగర్ అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. అయితే ఈ ఇద్దరి టైం ఇప్పుడు బాగా లేదనిపిస్తోంది.
Koratala Siva NTR 30 యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో రావాల్సిన ప్రాజెక్ట్ అంతకంతకూ వాయిదా పడుతూనే వస్తోంది. ఆచార్య సినిమా ఫలితంతో కొరటాల శివ టేకింగ్ మీద అందరికీ ఆనుమానం కలిగింది. అందుకే ఎన్టీఆర్ ఈ కొత్త కథ మీద గట్టిగా కూర్చున్నాడట. పాన్ ఇండియాకు సరిపడా కథను సెట్ చేయాలని కొరటాల, ఎన్టీఆర్ బాగానే శ్రమించార. అందుకే ఈ సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది.
ఎట్టకేలకు ఈ సినిమాను ఈ వారం ప్రారంభించబోతోన్నామని యూనిట్ సంబర పడింది. అయితే ఇంతలో తారకరత్న మరణ వార్త నందమూరి వంశాన్ని కుదిపేసింది. అందుకే ఈ సినిమాను ఇప్పుడు ప్రారంభించడం సరైంది కాదని భావించాడు ఎన్టీఆర్. అందుకే ఈ సినిమాను వీలు చూసుకుని తరువాత ఎప్పుడైనా ప్రారంభిద్దామని అన్నాడట. అందుకే ఈ మూవీ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేశారట.
ఇలా సినిమా ప్రారంభోత్సవాన్ని వాయిదా వేయడం సరైన నిర్ణయమని అభిమానులు కూడా అంటున్నారు. సినిమా ఆలస్యం అవుతోందనే బాధ ఉంది కానీ.. ఇలాంటి సమయంలో సినిమా ప్రారంభోత్సవాన్ని జరపకపోవడమే మంచిదని చెబుతున్నారు.
నందమూరి ఫ్యామిలీకి ఇప్పుడు వచ్చిన కష్టం చూసి అంతా కన్నీరుమున్నీరవుతున్నారు. నందమూరి ఇంట వరుసగా విషాదాలు జరుగుతూనే ఉన్నాయి. తారకరత్న 23 రోజులుగా హాస్పిటల్‌లో మృత్యువుతో పోరాడుతూనే వచ్చాడు. చివరకు తారకరత్న నింగికెగిశాడు. లోకేష్ పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన తారకరత్నను మొదటగా కుప్పంలోని ప్రైవేట్ హాస్పిటల్‌కు ఆ తరువాత బెంగళూరు హాస్పిటల్‌కు తరలించిన సంగతి తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook