Kota Srinivasa Rao Serious on Rumors: సోషల్ మీడియాలో రియల్ వార్తలకన్నా ఫేక్ వార్తలే ఎక్కువగా స్ప్రెడ్ అవుతాయన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో వినియోగం పెరిగిన తరువాత సెలెబ్రిటీలకు పెద్ద తలనొప్పిగా మారింది. సెలెబ్రిటీల విషయంలో సోషల్ మీడియా కాస్త హద్దులు దాటుతూ ఉంటుంది. క్షేమంగా, సంతోషంగా ఉన్న నటీనటుల మీద రూమర్లను స్ప్రెడ్ చేస్తారు. ఆరోగ్యం బాగా లేదంటూ, సీరియస్ అంటూ, ఇంకొన్ని సార్లు చనిపోయారంటూ ఫేక్ న్యూస్ ప్రచారంలోకి తీసుకొస్తారు. తీరా అవి వారి వద్దకు చేరుతాయి. వాటిని ఖండిస్తూ వీడియోలు రిలీజ్ చేస్తారు. అవాస్తవాలు ప్రచారం చేసే వారి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పుడు కోట శ్రీనివాస రావు విషయంలోనూ ఇదే జరిగింది. నేటి ఉదయం ఆయన మీద రకరకాల వార్తలు వచ్చాయి. ఆరోగ్యం బాగాలేదని, సీరియస్ అని, చనిపోయారంటూ రూమర్లు వచ్చాయి. దీంతో ఆయనకు ఫోన్ల మీద ఫోన్లు వచ్చాయట. ఇప్పటికే ఓ యాభై ఫోన్లు వచ్చాయట. తన మీద వచ్చిన రూమర్లను ఖండించాడు కోట శ్రీనివాసరావు. ఆ రూమర్లను నమ్మి ఇంటికి పోలీసులు కూడా వచ్చారట. ఇలాంటి రూమర్లను ప్రచారం చేసే వాళ్లని శిక్షించండి అంటూ కోట శ్రీనివాసరావు కోరాడు.


అయితే కోట శ్రీనివాస రావు విషయంలో ఇలా పదే పదే రూమర్లు వస్తుంటాయి. ఆయన ఆరోగ్యం బాగా లేదంటూ ఎప్పుడూ ఏదో ఒక రూమర్ కనిపిస్తూనే ఉంటుంది. ఉగాది పండుగ అని రేపు ఎలా చేసుకుందామని తాను ఆలోచిస్తుంటే.. ఇలా వార్తలు వచ్చాయని, ఆ విషయం తనకు తెలియదని, తన వాళ్లు చెబితే తెలిసిందని, అప్పటికే అందరూ ఫోన్లు చేస్తూ ఉన్నారని, అందరితో మాట్లాడుతూ ఉన్నానని కోట చెప్పుకొచ్చాడు.


ఇలానే గతంలో కొన్ని సార్లు సీనియర్ నటీనటులు, సీనియర్ సింగర్ల విషయంలో సోషల్ మీడియా కాస్త అత్యుత్సాహాన్ని ప్రదర్శించింది. చనిపోక ముందే చనిపోయారని వార్తలు ప్రచారం చేస్తుంటారు. సోషల్ మీడియాలో ఇలాంటివి క్షణాల్లో వైరల్ అవుతుంటాయన్న విషయం తెలిసిందే.


Also Read:  Deepthi Sunaina : బ్లాక్ చేశాడంటూ ఎమోషనల్.. వేడుకుంటోన్న దీప్తి సునయన


Also Read: Niharika Konidela Divorce : ఈ ఒక్క ఫోటోను మాత్రం డిలీట్ చేయని చైతన్య.. నిహారికతో విడాకులు కన్ఫామ్‌!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook