Pawan Kalyan Remuneration పవన్ కళ్యాణ్‌ రెమ్యూనరేషన్ మీద సోషల్ మీడియాలో జరుగుతూ ఉండే చర్చలు మామూలుగా ఉండవు. పవన్ కళ్యాణ్‌ సైతం తన రెమ్యూనరేషన్‌ల గురించి బహిరంగంగానే ఎన్నో సార్లు ఎన్నో వేదికల మీద చెప్పేశాడు. రోజుకి రెండు కోట్లు తీసుకుంటున్నాను అని ఎంతో గొప్పగా చెప్పుకొచ్చాడు. అయితే తాజాగా వాటిపై సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒకప్పుడు హీరో హీరోయిన్ల రెమ్యూనరేషన్‌లు బయటకు వచ్చేవి కాదు. కానీ ఇప్పుడు మాత్రం ఎవరు ఎంత తీసుకుంటున్నారు.. ఎన్ని రోజులకు ఎంత తీసుకుంటున్నారు అనేది అందరికీ తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్‌ రెమ్యూనరేషన్ అయితే ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. రోజుకు రెండు కోట్లు అంటూ పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ లెక్కలు వైరల్ అవుతుంటాయి. ఇరవై రోజులు, ఇరవై ఐదు రోజులకే నలభై, యాభై కోట్లు తీసుకుంటున్నాడని అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.


నేను ఇంత తీసుకున్నాను అంత తీసుకున్నాను అని చెప్పడం పద్ధతి కాదు, రామారావు గారు నాగేశ్వర రావు గారు కృష్ణ గారు వీళ్ళెవరూ రెమ్యూనరేషన్ గురించి చెప్పుకునేవారు కాదు.. రోజుకు రెండు కోట్లు తీసుకుంటున్నాను.. ఆరు కోట్లు తీసుకుంటున్నాను అని చెప్పడం మంచి పద్దతి కాదు.. అప్పట్లో ఇలా చెప్పేవారు కాదు అంటూ కోట శ్రీనివాస రావు చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.


Also Read: Tamannaah Bhatia Photos: పొట్టి బట్టల్లో రచ్చ రేపుతున్న తమన్నా భాటియా.. ఫొటోలు చూశారా?


కోట శ్రీనివాసరావు గతంలోనూ ఇలానే కాంట్రవర్సీ కామెంట్లు చేశాడు. అనసూయ డ్రెస్సింగ్ మీద, మెగా ఫ్యామిలీ మీద కోట కామెంట్లు చేశాడు. మా ఎన్నికల సమయంలోనూ కోట శ్రీనివాసరావు చేసిన కామెంట్లు, వాటిపై నాగబాబు వేసిన కౌంటర్లు ఎంతగా వివాదాలకు దారి తీశాయో అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు కోట శ్రీనివాసరావు చేసిన రెమ్యూనరేషన్ కామెంట్లు పెద్ద ఎత్తున చర్చలకు దారి తీస్తున్నాయి.


Also Read: Shruti Reddy Photos: పొట్టి గౌనులో కాక రేపేస్తున్న శృతి రెడ్డి.. వామ్మో?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK