Kovai Sarala: వందల సినిమాల్లో తన హాస్యంతో నటించి కడుపుబ్బా నవ్వించిన కోవై సరళ ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది. చిన్న హీరో మొదలుకుని పెద్ద హీరోలందరితో పని చేసిన సరళ అంటే సినిమా పరిశ్రమలో అందరికీ ఎంతో అభిమానం. సినిమాల్లో నవ్వులు పూయించినా నిజ జీవితంలో మాత్రం ఆమెకు కలిసి రాలేదు. ఆమె పెళ్లి చేసుకోకుండా ఆజన్మ బ్రహ్మాచారిణిగా ఉండిపోయింది. తాను పెళ్లి చేసుకోకపోవడానికి కారణంతోపాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇటీవల ఓ టీవీ ఇంటర్వ్యూలో పాల్గొన్న తన సినీ, వ్యక్తిగత జీవితంలోని కీలక అంశాలను వివరించింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Kajal Agarwal: నేను బాగా ఏడ్చాను.. అందుకే హీరోయిన్ అయ్యాను.. కాజల్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు


అల్లు అర్జున్‌తో పెళ్లికి రెడీ?
లవ్‌ స్టోరీలు, ప్రపోజల్స్‌ ఏమీ లేవా? అని ప్రశ్నించగా.. తనకు అలాంటివి రాలేదని వివరించారు. ఇప్పుడున్న హీరోల్లో అల్లు అర్జున్‌ను పెళ్లి చేసుకుంటానని సరదాగా చెప్పారు. బన్నీ గొంతు తనకు చాలా ఇష్టమని.. తనతో రెండు సినిమాలు చేసినట్లు తెలిపారు. తనకు తమిళ్‌, తెలుగు సినీ పరిశ్రమ రెండూ ఇష్టమని వెల్లడించారు. పరిశ్రమకు వచ్చి 35 ఏళ్లు అవుతోందని టాలీవుడ్‌ మెట్టినిల్లు, కోలివుడ్‌ పుట్టినిల్లుగా పేర్కొన్నారు. బ్రహ్మానందంతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. చాలా సినిమాల్లో బ్రహ్మానందం తనకు భర్తగా నటించినా.. ఆయన తనకు అన్న లాంటివాడని వివరణ ఇచ్చారు. తండ్రిలాగా సలహాలు ఇస్తారని తెలిపారు.

Also Read: Thandel Latest Update : నాగచైతన్య సినిమా కోసం రెండు క్లైమాక్స్ లు.. ఇది వర్క్ అవుట్ అవుతుందా


 


పెళ్లి ఎందుకు చేసుకోలేదంటే..
సినీ పరిశ్రమలోకి సులువుగానే వచ్చినా కుటుంబంలో మాత్రం పరిస్థితి కఠినం. తండ్రి సైనికోద్యోగి కావడంతో పద్ధతిగా పెరిగారు. ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. సినిమాల్లోకి వెళ్తానని చెప్పగానే ఆమె తండ్రి వెంటనే అంగీకరించారు. అనంతరం సినిమాల్లోకి వచ్చాక దాదాపు 900కు సినిమాల్లో కోవై సరళ హీరోయిన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, తల్లిగా ఎన్నో పాత్రల్లో నటించారు. సినిమాల పరంగా ఫుల్‌ బిజీ ఉన్న ఆమె వ్యక్తిగత జీవితాన్ని వదిలేసుకున్నారు. ఇప్పటివరకు ఆమె పెళ్లి చేసుకోలేదు. పెళ్లి ఎందుకు చేసుకోలేదని ప్రశ్నిస్తే ఆమె తిరిగి ఎదురు ప్రశ్నించారు. 'కచ్చితంగా పెళ్లి చేసుకోవాలని నిబంధన ఏమీ లేదు కదా?' అని అడిగారు. స్వేచ్ఛ కోసమే పెళ్లి చేసుకోలేదని కోవై సరళ చెప్పారు. భూమి మీదకు ఒంటరిగా వచ్చామని.. తర్వాతనే ఈ బంధాలన్నీ వచ్చాయని వివరించారు.


కోవై పేరు వెనుక..
తనకు పూరీ జగన్నాథ్‌ అంటే ఇష్టమైన దర్శకుడు అని.. దేశముదురు సినిమాలో తనకు పూర్తి స్వేచ్ఛనిచ్చారని కోవై సరళ చెప్పారు. తాను బయటకు వెళ్లనని.. స్నేహితులు లేరని కొంత భావోద్వేగానికి గురయ్యారు. చెన్నైలోని తన ఇంట్లోనే ఉంటానన్నారు. ఈ సందర్భంగా తన పేరు ముందు కోవై విషయమై ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. కోయంబత్తూరును కోవై అనేవారు. ఆ పేరుతోనే కోవై ఎక్స్‌ప్రెస్‌ రైలు ఉండేది. సినిమాల్లోకి వచ్చాక మీడియా వాళ్లు ఆ ట్రైన్‌ పేరు మీదుగా నాకు కోవై అని తగిలించారు. అప్పటి నుంచి కోవై సరళగా గుర్తింపు వచ్చిందని వివరించారు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter