Kovai Sarala Getup in Sembi కోవై సరళా తెలుగు ఆడియెన్స్‌ను ఒకప్పుడు ఎంతగానో నవ్వించింది. బ్రహ్మానందం, కోవై సరళ కాంబినేషన్‌ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అన్నట్టుగా నవ్వించేశారు. అయితే ఇప్పుడు కోవై సరళా తెలుగు సినిమాల్లో ఎక్కువగా కనిపించడం లేదు. మన దర్శక నిర్మాతలు ఆమెకు అవకాశాలు ఇవ్వడం లేదో.. ఆమె కావాలని తెలుగు సినిమాలకు దూరంగా ఉంటోందో తెలియడం లేదు గానీ.. ఆమె మాత్రం ఇప్పుడు టాలీవుడ్‌కు దూరంగానే ఉంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోలీవుడ్‌లో అడపాదడపా చిత్రాలు చేస్తోంది. రాఘవ లారెన్స్ తీసే కాంచన సినిమాల్లో కనిపిస్తోంది. ఇక అప్పుడెప్పుడు రెబల్ అంటూ కాస్త నవ్వించే ప్రయత్నం చేసింది. అది కూడా లారెన్స్ దర్శకత్వం వహించిన సినిమానే. అయితే కోవై సరళ నవ్వించడం మాత్రమే కాదు అందరినీ ఏడిపిస్తుందని,ఆలోచింపజేసేలా చేస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. కానీ తాజాగా కోవై సరళా అందరినీ ఆశ్చర్యపరిచింది.


 



కోవై సరళా ప్రధాన పాత్రలో నటించిన సెంబి సినిమా రెండో ట్రైలర్ నేడు విడుదలైంది. ఇందులో కోవై సరళ లుక్, నటన చూసి అందరూ ఫిదా అవుతున్నారు. ఓ పాత్ర కోసం ఇంతలా మారిపోతోరా? అంటూ ఆమె లుక్కుని చూసి జనాలు ఆశ్చర్యపోతోన్నారు. అయితే కోవై సరళకు కచ్చితంగా ఉత్తమ సహాయ నటిగా అవార్డు రావాల్సిందే అంటూ ట్రైలర్‌ను షేర్ చేస్తున్నారు.


ఈ ట్రైలర్‌ చూస్తుంటే.. బడుగు బలహీన వర్గాలను రాజకీయ నాయకులు తమ ఓట్ల కోసం ఎలా వాడుకుంటారు? అనే పాయింట్ మీద సినిమాను తీసినట్టుగా కనిపిస్తోంది. ఓట్లు వేస్తే డాక్టర్ అవ్వవు.. చదువుకుంటే డాక్టర్ అవుతావ్ అంటూ తన మనవరాలికి కోవై సరళ చెప్పిన డైలాగ్‌తోనే ఈ సినిమా ఎలా ఉంటుందో అర్థమవుతోంది. మొత్తానికి ఈ మూవీ మాత్రం కోవై సరళ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచేలానే ఉంది. ప్రభు సోలోమన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో అశ్విన్ కుమార్ హీరోగా నటించాడు.


Also Read : Bigg Boss 6 Telugu Winner : బిగ్ బాస్ విజేత ఎవరంటే?.. ముందే చెప్పేసిన గూగుల్


Also Read : Jabardasth Anchor Sowmya : యాంకర్ రష్మీకే ఎసరు పెట్టేసింది.. దుమ్ములేపేసిన జబర్దస్త్ యాంకర్ సౌమ్య


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook