Naga Shauryas Krishna Vrinda Vihari Movie Padayatra starts from Today: టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య.. హిట్లు, ఫట్లతో సంబంధంలేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీ బిజీగా ఉన్నాడు. నాగశౌర్య నటించిన 'కృష్ణ వ్రింద విహారి' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అనీష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఉషా ముల్పూరి నిర్మించారు. ఈ సినిమాలో న్యూజిలాండ్ సింగ‌ర్‌, బాలీవుడ్ న‌టి షిర్లే సెటియా హీరోయిన్‌గా నటించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'కృష్ణ వ్రింద విహారి' సినిమా సెప్టెంబరు 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌ కార్యక్రమాలను వేగవంతం చేసింది. అయితే ప్రమోషన్స్‌ కార్యక్రమాలను సరికొత్తగా ప్లాన్ చేసింది చిత్ర బృందం. రాజకీయాల మాదిరి చిత్ర యూనిట్ పాదయాత్రకు శ్రీకారం చుట్టింది. ఈ పాదయాత్ర నేటి నుంచే మొదలవనుంది. సెప్టెంబర్ 14న మొదలవనున్న 'కృష్ణ వ్రింద విహారి' టీమ్ పాదయాత్ర.. సెప్టెంబర్ 18న ముగియనుంది. పాదయాత్రలో భాగంగా ప్రేక్షకులు, అభిమానులతో కలసి చిత్ర యూనిట్ సందడి చేయనుంది.


సెప్టెంబర్ 14న తిరుపతి.. 15న నెల్లూరు, ఒంగోలు.. 16న విజయవాడ, గుంటూరు, ఏలూరు.. 17న భీమవరం, రాజమండ్రి.. 18న కాకినాడ, వైజాగ్‌లో 'కృష్ణ వ్రింద విహారి' చిత్ర యూనిట్ పాదయాత్ర చేయనుంది. ఈ పాదయాత్రలో హీరో నాగశౌర్య స్పెషల్ అట్రాక్షన్ కానున్నాడు. తెలుగు సినీ చరిత్రలో ఇలా పాదయాత్ర చేయడం ఇదే మొదటిసారి. ఏపీ రాష్ట్ర డీజీపీ ఈ పాదయాత్రకు అనుమతిని ఇచ్చారు. అంతేకాదు చిత్ర బృందంకు పోలీస్ శాఖ రక్షణ అందించాలని ఆదేశాలను జారీ చేశారు.



'కృష్ణ వ్రింద విహారి' సినిమాలో ప్రముఖ నటి రాధికా శ‌ర‌త్ కుమార్ కీ రోల్‌లో న‌టిస్తున్నారు. వెన్నెల కిషోర్‌, రాహుల్‌ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్. ఇక ఇటీవల విడుదల అయిన ట్రైలర్‌లో హీరో మంచు విష్ణు కనిపించారు. ఆయన ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తున్నారా లేదా ఆ ఒక్క సీన్‌లో మాత్రమే ఉంటారా అన్నది తెలియరాలేదు. 


Also Read: Gold Price Today 14 September: బంగారం ప్రియులకు శుభవార్త.. స్వల్పంగా తగ్గిన పసిడి ధర! వెండి రేటు మాత్రం  


Also Read: Horoscope Today 14 September 2022: ఆ రాశుల వారికి సంధికాలం.. వ్యాపార, ఉద్యోగస్థులకు ఏదీ కలిసిరాదు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook