Krishnakumar Kunnath Passes Away: ప్రముఖ సింగర్ కృష్ణ కుమార్ కున్నత్ (53) హఠాన్మరణం చెందారు. కోల్‌కతాలోని నార్జూల్ మంచాలో మంగళవారం (మే 30) జరిగిన ఓ మ్యూజిక్ కాన్సర్ట్‌లో కృష్ణ కుమార్ కన్నత్ (కెకె) పాల్గొన్నారు. అక్కడ తన సింగింగ్ పెర్ఫామెన్స్ అనంతరం తాను బస చేసే హోటల్‌కి వెళ్లారు. ఆ తర్వాత కొద్దిసేపటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే కెకె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిజానికి కాన్సర్ట్‌లో పాటలు పాడుతున్న సమయంలోనే కెకె అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఒంట్లో బాగాలేదంటూ ఇంటర్వెల్ సమయంలోనే నిర్వాహకులతో ఆయన చెప్పినట్లు సమాచారం. అయినప్పటికీ కాన్సర్ట్ ముగిసేవరకూ తన సింగింగ్ పెర్ఫామెన్స్ కొనసాగించారు. కాన్సర్ట్ ముగిశాక నిర్వాహకులు ఆయన్ను ఎస్‌ప్లానేడ్ ఫైవ్ స్టార్ హోటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ కెకె ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే కన్నుమూశారు. 


మంగళవారం రాత్రి 10గ. సమయంలో సీఎంఆర్ఐ ఆసుపత్రి వైద్యులు కెకె మృతి చెందినట్లు అధికారికంగా నిర్ధారించారు. కెకె హఠాన్మరణంతో సంగీత ప్రపంచంలో విషాదం నెలకొంది. కెకెని అభిమానించేవారు విషాదంలో మునిగిపోయారు.  కెకెకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బుధవారం (జూన్ 1) ఉదయం కెకె భార్య, పిల్లలు కోల్‌కతా చేరుకోనున్నారు. 


విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ :


కెకె మరణంపై సోషల్ మీడియాలో పలువురు ప్రముఖులు, నెటిజన్లు సంతాపం ప్రకటిస్తున్నారు. కెకె మృతి చెందినట్లు తెలిసిన కాసేపటికే ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా స్పందించారు. కెకెగా ప్రసిద్ధి చెందిన ప్రముఖ గాయకుడు కృష్ణ కుమార్ కున్నత్ హఠాన్మరణం విచారకరమని పేర్కొన్నారు. 


కెకె పాటలు అనేక రకాల భావోద్వేగాలను ప్రతిబింబిస్తాయని... ఆయన పాటలతో అన్ని వయసులవారు కనెక్ట్ అయ్యారని పేర్కొన్నారు. పాటల రూపంలో కెకెని ఎప్పటికీ గుర్తుంచుకుంటామని... కెకె కుటుంబానికి, అతని అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు వెల్లడించారు.



Also Read: Wednesday Remedy : బుధవారం ఇలా చేస్తే కష్టాలకు పక్కా పుల్‌స్టాప్‌ పడుతుంది..!


Also Read: Mukesh ambani and gautam adani: ముకేశ్ అంబానీ గౌతమ్ అదానీ ఏం చదువుకున్నారో తెలుసా ?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook