Krishnamma - Satyadev: ప్రముఖ నిర్మాణ సంస్థ చేతికి సత్యదేవ్ కృష్ణమ్మ థియేట్రికల్ రైట్స్.. మే 10న విడుదల..
Krishnamma Release Date: సత్యదేవ్ తెలుగులో ఒక జానర్‌తో సంబంధం లేకుండా సినిమాలు చేసే హీరోల్లో సత్యదేవ్ ఒకరు. తాజాగా ఈయన `కృష్ణమ్మ` సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. మే 10 విడుదల కాబోతున్న ఈ సినిమా హక్కులు ప్రముఖ నిర్మాణ సంస్థ చేతికి దక్కాయి.
Krishnamma Release Date: సత్యదేవ్ తెలుగులో టాలెంట్‌తో ఒక్కో మెట్టు ఎక్కుతూ తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. అంతేకాదు సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఈ రేంజ్‌కు చేరడం మాములు విషయం కాదు. కమర్షియల్, ఎక్స్‌పెరిమంటల్ అని కాకుండా అన్ని జానర్స్‌లో సినిమా చేస్తూ దూసుకుపోతున్నాడు. తాజాగా ఈయన 'కృష్ణమ్మ' సినిమాతో పలకరించబోతున్నాడు. రా అండ్ రస్టిక్ బ్యాక్ డ్రాప్ మూవీగా ప్రేక్షకుల ముందుకు మే 10న రాబోతుంది. ఈ సినిమాను వి.వి.గోపాలకృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. కొరటాల శివ తొలిసారి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఎన్నో సక్సెస్‌పుల్ చిత్రాలతో టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థగా రాణిస్తోన్న మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాను విడుదల చేస్తున్నాయి.
'కృష్ణమ్మ' సినిమాలో సత్యదేవ్‌కు జోడిగా అతీరారాజ్ యాక్ట్ చేసింది. లక్షణ్, కృష్ణ, అర్చన, రఘుకుంచె, నందగోపాల్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, టైటిల్ సాంగ్ 'ఏమవుతుందో మనలో, దుర్గమ్మ లిరికల్ సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో సత్యదేవ్‌లోని మరో కోణాన్ని ఆవిష్కరించాడు దర్శకుడు. ఈ సినిమాకు కాల భైరవ సంగీతం అందించారు. సన్నీ కూరపాటి సినిమాటోగ్రఫీ అందించారు.
ఈ సినిమాకు సమర్ఫణ.. కొరటాల శివ..
సమర్పణ - కొరటాల శివ
బ్యానర్ - అరుణాచల క్రియేషన్స్
నిర్మాత - కృష్ణ కొమ్మలపాటి
రచన, దర్శకత్వం - వి.వి.గోపాలకృష్ణ
సంగీతం - కాల భైరవ
సినిమాటోగ్రఫీ - సన్నీ కూరపాటి
ఎడిటర్ - తమ్మిరాజు
ఆర్ట్ - రామ్ కుమార్
పాటలు - అనంత శ్రీరాం
ఫైట్స్ - పృథ్వీ శేఖర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - రవి సూర్నెడ్డి
పి.ఆర్.ఒ - వంశీ కాకా
Read More: Rajasthan Man Collapses: పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తుండగా ఊహించని ఘటన.. వీడియో వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter