Kriti Shetty: మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ సాధించింది హీరోయిన్ కృతి శెట్టి. నేషనల్ అవార్డు సైతం సాధించుకున్న ఉప్పెన సినిమాలో బేబమ్మ క్యారెక్టర్ లో కనిపించి అందరిని మెప్పించింది. ఆ తరువాత ఈ హీరోయిన్ చేసిన శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు సినిమాలో కూడా మంచి విజయం సాధించాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొదటి మూడు చిత్రాలతోనే సూపర్ సక్సెస్ సాధించడంతో ఈ హీరోయిన్ కి వరుసగా ఆఫర్లు రావడం మొదలయ్యాయి. అయితే అప్పటినుంచి కృతికి కష్ట కాలం మొదలైంది. విరుదలైన ప్రతి సినిమా ఫ్లాప్ గా మిగిలింది. కృతి చివరగా నాగచైతన్య కస్టడీ చిత్రంలో కనిపించగా ఆ చిత్రం కూడా డిజాస్టర్ గా నిలిచింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ చేతిలో రెండు సినిమాలు మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి మలయాళం సినిమా కాగా మరొకటి తెలుగులో శర్వానంద్ తో చేస్తున్న చిత్రం. మరి ఈ రెండు అయినా ఈ హీరోయిన్ కి మరోసారి సూపర్ హిట్ ఇస్తాయేమో అంటూ అభిమానులు ఎదురుచూస్తున్నారు.


ఈ నేపథ్యంలో తాజాగా ప్రతి ఒక షాప్ ఓపెనింగ్ కి అటెండ్ అయ్యింది. అయితే ఈ ఓపెనింగ్ లో ఈ హీరోయిన్ కి అనుకోని ఒక సంఘటన ఎదురయ్యింది. రీసెంట్‌గా ఓ చీరల షాపు ఓపెనింగ్‌కి వెళ్లిన కృతిని చూసిన ఒక అభిమాని ఎగ్జైంట్మెంట్‌లో ‘స్కంద’ సినిమా సూపరుంది.. అంటూ పొగడ్తలు కురిపించాడు. ‘సూపరుందా?’ అని నవ్వుతూ ‘నేను లేను దాంట్లో అని’ కృతి సమాధానం చెప్పారు. 


స్కంద సినిమాలో అసలు కృతి, లేదు ఈ సినిమాలో హీరోయిన్ శ్రీ లీల. ఈ మధ్యకాలంలో ఉన్న హీరోయిన్స్ లో ఎక్కువగా పోటీ నడిచింది కృతి శెట్టి, శ్రీలీల కే.
ఇంకెవరైనా హీరోయిన్స్ అయితే కాస్త ఫీలయ్యేవారేమో.. కానీ కృతి మాత్రం ఇంత ఈజీగా తీసుకోవడం ఆశ్చర్యపరిచింది.ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.


 



Read: Ayodhya Crown: అయోధ్య రాముడికి స్వర్ణ కిరీటం.. వజ్రాలు, విలువైన రాళ్లు పొదిగినది ఎన్ని కోట్లు అంటే?


Also Read: BRS Party MLAS Meet Revanth: బీఆర్‌ఎస్‌ పార్టీలో కలకలం.. సీఎం రేవంత్‌ను కలిసిన నలుగురు ఎమ్మెల్యేలు


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook