Adipurush Movie Updates | బాహుబలి తరువాత ప్రభాస్ పలు ప్యాన్ ఇండియా చిత్రాలు చేస్తున్నాడు. అందులో ఒకటి ఆదిపురుష్. టీ సిరీస్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో ప్రభాస్ ( Prabhas ) శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నారు. అయితే సీతాదేవి పాత్ర చేయడానికి ఎవరిని ఎంచుకున్నారో అనేది మాత్రం సస్పెన్స్ గా కొనసాగుతోంది. కొంత కాలం క్రితం బాలీవుడ్ స్టార్ హీరోయిన్, టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ ( Anushka Sharma ) సీతాదేవి పాత్ర చేయనుంది అని వార్తలు వచ్చాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read:  AP Ration Cards: 35 రోజుల్లోనే 6 లక్షల రేషన్ కార్డులు జారీ చేసి ఏపి ప్రభుత్వం


అయితే ఈ వార్తలను అనుష్క ఖండించింది. అలాగే కైరా అద్వానీ పేరు కూడా వినిపించింది. దాంతో ఫ్యాన్స్ మళ్లీ సీతా దేవి పాత్ర ఎవరు చేస్తారో అనే డైలమాలో పడ్డారు. 


తాజాగా వస్తున్న వార్త ప్రకారం ఆదిపురుష్ ( Adipurush ) చిత్రంలో కృతి సనన్ సీతామాత పాత్రలో కనిపించనుందట. ఈ మూవీలో నటించడానికి కృతి సనన్ ఆసక్తి చూపిస్తోందట. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన ఇంకా వెలువరలేదు. అప్పటి వరకు ఈ వార్తను ఒక పుకారుగానే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే టీమ్ ఎనౌన్స్ చేయడానికి ముందు ఇలా ఎన్నో పుకార్లు రావడం సహజం.



Also Read | TS EAMCET: ఇంటర్ వెయిటేజ్ మార్కులు ఈ ఏడాది లేనట్టే


ఆదిపురుష్ చిత్రం తెలుగు, తమిళం, హిందీతో పాటు పలు భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీని ఓం రావత్ తెరకెక్కిస్తున్నాడు. రామాయణం ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ ఇందులో శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ చోటే నవాబ్ సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా కనిపించనున్నాడు.


A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR