Kriti sanon Prabhas Marriage : ప్రభాస్, కృతి సనన్ మీద నేషనల్ మీడియా రాస్తోన్న వార్తల గురించి తెలిసిందే. కానీ మన తెలుగు మీడియా వరకు మాత్రం అనుష్క, ప్రభాస్ జోడి మీద ఎక్కువగా వార్తలు రాస్తుంటుంది. ఆదిపురుష్‌ ఎఫెక్ట్‌తో ప్రభాస్, కృతి సనన్‌ల మీద జాతీయ మీడియా రూమర్లు రాయడం ప్రారంభించింది. అయితే కృతి సనన్ మాత్రం ప్రభాస్‌ మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తోన్నట్టుగా, షూటింగ్ సమయంలో కాస్త క్లోజ్ అయినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఓ సారి కరణ్‌ జోహార్ కాఫీ విత్ కరణ్ షోలో ప్రభాస్‌కు ఫోన్ చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

త్వరగా లిఫ్ట్ చేసే వారికి మాత్రమే ఆ ఫోన్ చేస్తుంటారు. అలా తన ఫోన్‌ను త్వరగా లిఫ్ట్ చేస్తాడని కృతి సనన్‌కి తెలుసు కాబట్టే ప్రభాస్‌కు తను ఫోన్ చేసింది. అది కాకుండా.. ఆదిపురుష్‌ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఈ ఇద్దరి జోడి అందరినీ ఆకట్టుకుంది. ప్రభాస్‌ మోకాలికి సర్జరీ కావడం, సరిగ్గా నిలబడ లేకపోవడం, నడవలేకపోవడంతో కృతి సనన్ చేయి అందించి సాయం చేసింది. ఇక ప్రభాస్‌కు చెమటలు పడుతుంటే.. కృతి సనన్ తన కొంగుని అందించేందుకు చూసింది.


 



అలా ప్రభాస్, కృతి సనన్ జోడి మీద అందరి దృష్టి పడింది. ఇక కృతి సనన్ సైతం ప్రభాస్‌ను తినేలానే చూస్తూ ఉండిపోయింది. ఆ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రస్తుతం కృతి సనన్ భేడియా (తెలుగులో తోడేలు)తో హిట్ కొట్టేసింది. వరుణ్‌ ధావన్‌, కృతిలకు హిట్ పడింది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్‌లో పదే పదే ప్రభాస్ పేరు మాత్రం ప్రస్థావనలోకి వచ్చింది.


తన జీవితంలోకి డార్లింగ్ వచ్చాడంటూ కృతి సనన్ గురించి వరుణ్‌ ధావన్ అన్నాడు. ఇక ఇప్పుడు ఓ మీడియాతో మాట్లాడుతూ ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటాను అని కృతి సనన్ చెప్పింది. కాకపోతే టైగర్ ష్రాఫ్, ప్రభాస్, కార్తీక్ ఆర్యాన్‌ల పేర్లు ఆప్షన్స్‌గా ఇవ్వడం.. ఈ ముగ్గురిలో ఎవరిని ఫ్లర్ట్ చేస్తావ్.. ఎవరిని పెళ్లి చేసుకుంటావ్.. డేట్ ఎవరితో చేస్తావ్? అని అడిగారు. కార్తీక్‌ను ఫ్లర్ట్.. డేట్ అయితే టైగర్‌తో.. పెళ్లి మాత్రం ప్రభాస్‌తో అని చెప్పేసింది కృతి సనన్.

Also Read : Genelia Riteish Deshmukh : సమంత నాగ చైతన్యలానే జెనిలీయా రితేష్ దేశ్ ముఖ్.. జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో?


Also Read : Naga Chaitanya Shobitha Dhulipalla : అడ్డంగా దొరికిపోయిన శోభితా-నాగ చైతన్య?.. ఆడేసుకుంటున్న సమంత ఫ్యాన్స్.. అక్కినేని అభిమానుల మాట ఇదే


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook