Kangana Ranaut’s private photos: హృతిక్ దగ్గర కంగనా ప్రైవేట్ ఫోటోలు.. అందంగా ఉందంటూ బాలీవుడ్ క్రిటిక్ సంచలనం
KRK alleges Hrithik Roshan showed him Kangana Ranaut’s private photos: హృతిక్ రోషన్ తనకు కంగనా ప్రైవేట్ ఫోటోలు చూపించాడని కమల్ ఆర్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే
KRK alleges Hrithik Roshan showed him Kangana Ranaut’s private photos: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్, హృతిక్ రోషన్ ల ప్రేమ కథ గురించి బయట ఎవరికీ పెద్దగా తెలియదు. ఒకప్పుడు వీరి ఎఫైర్‌పై బాలీవుడ్‌లో వార్తలు హల్‌చల్ చేసేవి. ఈ విషయంపై హృతిక్ ఎప్పుడూ మాట్లాడనప్పటికీ, కంగనా సోషల్ మీడియాలో హృతిక్ రోషన్ గురించి చాలాసార్లు అనేక సంచలన విషయాలు బయట పెట్టడమే కాక అనేక రకాల ఆరోపణలు కూడా చేసింది.
అయితే ఏది ఏమైనప్పటికీ వారి బంధం ముగిసి చాలా సంవత్సరాలు గడిచాయి. అయితే ఇప్పుడు మరోసారి బాలీవుడ్ క్రిటిక్ గా చెప్పుకునే కమల్ రషీద్ ఖాన్ అదేనండీ కేఆర్కే ఇప్పుడు పాత విషయాలను తెరమీదకు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. హృతిక్ రోషన్ -సైఫ్ అలీ ఖాన్ కలిసి నటించిన 'విక్రమ్ వేద' టీజర్‌పై తన రివ్యూ షేర్ చేసిన కేఆర్కే హృతిక్ రోషన్ వ్యక్తిగత జీవితం గురించి కూడా షాకింగ్ విషయాలు బయటపెట్టారు.
హృతిక్ రోషన్ ఒకసారి తనను ఇంటికి పిలిచి కంగనా రనౌత్ తో తన ప్రేమకథ చెప్పాడని అలాగే వారిద్దరికీ సంబందించిన కొన్ని స్పెషల్ ఫోటోలను కూడా చూపించాడని కమల్ ఆర్ ఖాన్ చెప్పారు. తన సోషల్ లో మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియోలో కమల్ ఆర్ ఖాన్ మాట్లాడుతూ హృతిక్ మీరు ఎంతకాలం మీ తప్పుడు కథలు చెబుతారు? కొన్నిసార్లు అసలు కథ కూడా చెప్పండి అని పేర్కొన్నారు. నన్ను మీ ఇంటికి పిలిచి కంగనా గురించి నీ కథ చెప్పావు, ఇది మాత్రమే కాదు, నువ్వు కంగనాకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా నాకు చూపించారన్నా కేఆర్కే, నేను ఖచ్చితంగా దీని గురించి మీకు తరువాత చెబుతానని అన్నారు.
క్రిష్ 3 షూటింగ్ సమయంలో, హృతిక్ రోషన్ కంగనా రనౌత్ మధ్య సాన్నిహిత్యం పెరిగింది. అప్పట్లోనే ఇద్దరూ డేటింగ్ ప్రారంభించారని ప్రచారం జరిగింది. అదే సమయంలో వారు ఈ ప్రచారానికి ఊతం ఇస్తూ హృతిక్ కంగనా తరచుగా కలిసి కనిపించారు. అయితే మీ ఇద్దరి మధ్య ఏమైనా ఉందా అని హృతిక్‌ను ప్రశ్నించినప్పుడు, ఆయన ఇది ఒక రూమర్ నా అని చెప్పాడు. కానీ కంగనా రనౌత్ తమ రిలేషన్ ను అంగీకరించింది. మేము ఇద్దరం డేటింగ్ చేస్తున్నామని బయట పెట్టింది. ఆ తరువాత వీరి మధ్య దూరం పెరగడంతో సోషల్ మీడియాలో హృతిక్ రోషన్ పరువు తీసేలా కంగనా అనేక సంచలన ఆరోపణలు చేసింది. అయితే కేఆర్‌కే చేసిన ఈ ఆరోపణలపై కంగనా ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో చూడాలి.