Hebba Patel Secret: తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన అమ్మాయే ఈమె. చక్కని చుక్క. అందంతో పాటు చక్కని అభినయం ఉన్నందున అందర్నీ ఆకట్టుకోగలిగింది. ఓ రకమైన సాంప్రదాయ దుస్తుల్లో ఒక్కసారిగా కన్పించడంతో అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడే ఆమె అసలెవరనేది తెలియడంతో మరింత షాకయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుమారి 21ఎఫ్ సినిమా గురించి అందరికీ ముఖ్యంగా యూత్‌కు బాగా తెలుసు. రాజ్ తరుణ్ సరసన నటించిన ఈ ముంబై బ్యూటీ తన చలాకీతనంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అందంతో పాటు అభినయం ఆమె సొంతం. కానీ ఆ తరువాత సినిమాల ఎంపిక విషయంలో చేసిన తప్పులతో ఆశించిన హిట్స్ అందుకోలేకపోయింది. భీష్మ, రెడ్ సినిమాల్లో ఇటీవల కన్పించినా ఆ తరువాత అవకాశాలు పెద్దగా రాలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే ఈ అమ్మడు ఇటీవల షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.



ఆ ఫోటోలు చూడగానే ఇంతకాలం ఈ అమ్మాయి ఎవరనే విషయంలో అందరూ పొరబడ్డారని అర్ధమైంది. ఆమె అసలెవరనేది తేలింది. హెబ్బా పటేల్ పేరు చివర పటేల్ కన్పించగానే గుజరాతీ అనుకున్నారు. కానీ ఆమె ముంబైకు చెందిన ముస్లిం అమ్మాయి అని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. రంజాన్ మాసం సందర్భంగా సాంప్రదాయ బుర్ఘాలో కన్పించడంతో ముందు ఆశ్చర్యపోయరంతా. ఆ తరువాత అసలు సంగతి అర్ధమైంది. 


ఇన్‌స్టాలో హెబ్బా పటేల్ స్వయంగా షేర్ చేసిన ఫోటోలు బుర్ఘాలో ఉండటమే కాదు..ముస్లింల పవిత్ర స్థలమైన మక్కా మదీనాలో ఉమ్రా యాత్ర సందర్భంగా దిగిన ఫోటోలు కావడంతో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఆమె ముస్లిం అని నిర్దారణైంది. ఇది తెలియని వారంతో షాక్‌కు గురవుతున్నారు. ఆమె పేరు చూసి ఎవరూ తెలుసుకోలేరు కూడా. ఇప్పటి వరకూ అదే జరిగింది. 


Also read: Surendar Reddy Injury: నన్ను కాపాడబోయి కాలు విరగ్గొట్టుకున్నాడు.. అఖిల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook