Kushboo Sundar Hospitalized: బీజేపీ నాయకురాలు, జాతియ మహిళా కమిషన్ సభ్యురాలు, సీనియర్ నటి కుష్బూ తాజాగా హాస్పిటల్‌ పాలైంది. తనకు ఆరోగ్యం బాగా లేదని కుష్బూ వేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇందులో కుష్బూ తన ఆరోగ్య పరిస్థితిని వివరించింది. జ్వరం, ఒళ్లు నొప్పులు, నీరసం ఇలా అన్నీ వచ్చేశాయి.. ఎడినో వైరస్‌ సోకింది.. చాలా కష్టంగా అనిపిస్తోంది.. వైరస్‌ సోకినట్టుగా ఎలాంటి లక్షణాలు కనిపించినా నిర్లక్ష్యం చేయకండి.. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పరి రక్షించుకోండని కుష్బూ పోస్ట్ వేసింది. త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుష్బూ ప్రస్తుతం సినీ,రాజకీయ పనులతో బిజీగా ఉంటోంది. మొన్న జరిగిన పొన్నియిన్ సెల్వన్ రెండో పార్ట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మెరిసింది. మణిరత్నంతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంది. సుహాసినితో ఉన్న ఫ్రెండ్ షిప్‌ గురించి చెప్పింది. ఇక జాతియ మహిళా కమిషన్ సభ్యురాలిగా పదవి దక్కించుకున్న తరువాత చిరంజీవిని ప్రత్యేకంగా కలిసిన సంగతి తెలిసిందే.


కుష్బూ ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటోంది. దళపతి విజయ్ నటించిన వారిసు సినిమాలో కుష్బూ నటించిందా? లేదా? అన్న రూమర్లు, దాని చుట్టు అల్లుకున్న కాంట్రవర్సీతో కుష్బూ ఎక్కువగా ఫేమస్ అయింది. విజయ్, రష్మిక, కుష్బూ ఉన్న ఫోటో ఒకప్పుడు బాగానే ట్రెండ్ అయింది. దీంతో వారిసు సినిమాలో కుష్బూ ఉందని అంతా అనుకున్నారు.


Also Read:  Ravanasura Movie Review : రావణాసుర రివ్యూ.. లాజిక్స్ వెతికితే కష్టమేరా



కానీ చివరకు థియేటర్లో సినిమా చూసిన వారికి కుష్బూ కనిపించకపోవడంతో అంతా షాక్ అయ్యారు. ఇదే ప్రశ్న కుష్బూని అడిగితే.. నేను నటించాను అని చెప్పానా? మీకు డౌట్లు ఉంటే.. యూనిట్‌ను అడగండి అని కుష్బూ తప్పించుకుంది. కానీ ఆ సినిమా ఎడిటర్ మాత్రం అసలు విషయం చెప్పాడు. కుష్బూ పాత్ర బాగా వచ్చిందని, కానీ నిడివి సమస్య వల్ల ఆ పాత్రను ఎడిటింగ్‌లో లేపేయాల్సి వచ్చిందని,  ఆ విషయాన్ని ఆమెకు చెప్పామని ఎడిటర్ బయటపెట్టేసిన సంగతి తెలిసిందే.


Also Read: Ravanasura Twitter Review: రావణాసుర ట్విట్టర్ రివ్యూ.. మళ్లీ ఇలాంటివి చేయకు అన్న!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook