Kushboo Sundar Tweet Gets Trolled  సినీ నటి, రాజకీయ ప్రముఖురాలు కుష్బూ సోషల్ మీడియాలో ఎంతగా ట్రోలింగ్‌ను ఎదుర్కుంటుందో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న నటి.. ఇప్పుడు బీజేపీలోకి వచ్చింది. రాహుల్ గాంధీ మీద ఆమె వేసే ట్వీట్లు ఇప్పుడు ఎక్కువగా కాంట్రవర్సీకి దారి తీస్తుంటాయి. ఇక కుష్బూకి తన మతం పేరు మీద ఎక్కువగా ట్రోలింగ్ ఎదురవుతుంటుంది. ఆమె పూర్తి పేరు, సొంత పేరు మీద జరిగిన వివాదాలు అందరికీ తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుష్బూ ఈ మధ్య వారిసు విషయంలో ఎక్కువగా వార్తల్లోకి వచ్చింది. వారిసు సినిమాలో కుష్బూ పాత్రను మొత్తంగా లేపేశారు. ఎడిటింగ్‌లో అలా తీసేసినందుకు ఎడిటర్‌ కూడా ఆమెకు సారీ చెప్పాడు. ఆ విషయాన్ని ముందుగానే దర్శకుడు కుష్బూకి చెప్పాడట. కానీ కుష్బూ మాత్రం ఈ విషయాన్ని మీడియాతో పంచుకునేందుకు అంతగా సుముఖత వ్యక్తం చేసినట్టుగా కనిపించలేదు.


కుష్బూ ఇప్పుడు చిరంజీవి ట్వీట్‌కు స్పందించడం, అందులో ఓ కామెంట్ చేయడంతో ట్రోలింగ్‌కు గురవుతోంది. చిరంజీవి తన తల్లి అంజనా దేవీ పుట్టిన రోజు సందర్భంగా ఓ ఎమోషనల్ పోస్ట్ వేశాడు. అందులో చిరంజీవి ఫ్యామిలీ అంతా కూడా ఉంది. నాగబాబు, పవన్ కళ్యాణ్‌, చిరు చెల్లెళ్లు ఇలా అందరూ ఉన్నారు.


 



మాకు జన్మని, జీవితాన్ని ఇచ్చిన అమ్మ  పుట్టిన రోజు. జన్మజన్మలు నీకు బిడ్డలుగా పుట్టాలని కోరుకుంటూ అని ఇలా ట్వీట్ వేశాడు. దీనిపై కుష్బూ స్పందించింది. చిరంజీవి గారు మీ అమ్మ పుట్టిన రోజు సందర్భంగా నా శుభాకాంక్షలు చెప్పండి.. ఆమెకు నా కోడి (కోటి) ప్రణామాలు అని చెప్పుకొచ్చింది. అయితే ఆమె కోడి అని చెప్పడంతో మన తెలుగు వాళ్లు షాక్ అయ్యారు.


తమిళంలో కోడి.. తెలుగులో కోటి అనే అర్థం అని కొద్ది మందికే తెలుసు. అయితే అది తెలియని వాళ్లు.. కోడి ఏంటి? కోడి.. అంటూ కుష్బూ ట్వీట్‌ మీద కౌంటర్లు వేస్తున్నారు. ఇది చాలా ఓవర్.. తమిళంలో కోడి అంటే.. కోటి.. మీరు భాషను గౌరవించాలి అంటూ తమిళ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Also Read:  Taraka Ratna Health Issue: తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషయంలో తెర వెనుక హీరో.. రుణపడి ఉంటామంటున్న అభిమానులు!


Also Read: Rajinikanth Called : వీర సింహారెడ్డి డైరెక్టర్ కు రజనీకాంత్ ఫోన్.. గాల్లో తేలిపోతున్నాడుగా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook