Lata Mangeshker Health Update: ప్రముఖ నేపధ్య గాయని, భారతరత్న అవార్డు గ్రహీత  లతా మంగేష్కర్(92) ఇటీవల కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ నెల 11న స్వల్ప లక్షణాలతో ఆమె ముంబయిలోని బ్రీచ్‌కాండీ ఆస్పత్రిలో (Breach Candy Hospital in south Mumbai) చేరారు. ఆమె వయసు రీత్యా ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు.  ప్రస్తుతం లతా మంగేష్కర్‌ ఆరోగ్యం మెరుగుపడుతోందని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ టోపే (Health Minister Rajesh Tope) వెల్లడించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘''లతా మంగేష్కర్‌ ఆరోగ్యం మెరుగవుతోంది. ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నా. లతా ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడం పట్ల ప్రజలు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకే వారి కుటుంబ సభ్యులతో చర్చించి ఎప్పటికప్పుడు ఆస్పత్రి అధికార ప్రతినిధి అప్‌డేట్స్‌ ఇచ్చేలా చూడాలని ఆస్పత్రి యాజమాన్యాన్ని కోరాను''’’అని మంత్రి వివరించారు. 


Also Read: RGV Sensational Tweet: 'నేను చావాలన్న మీ కోరిక నెరవేరాలి'.. రామ్​ గోపాల్​ వర్మ ట్వీట్!


లతా మంగేష్కర్‌కు (Lata Mangeshker) ఐసీయూలోనే చికిత్స కొనసాగుతోందని ఆస్పత్రి వైద్యుడు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ప్రతీత్‌ సమదాని తెలిపారు. మరోవైపు,  లతా మంగేష్కర్‌  బాగానే ఉన్నారని, తమ కుటుంబ గోప్యతను కాపాడాలంటూ ఆమె మేనకోడలు రచనా షా గురువారం మీడియాకు విజ్ఞప్తి చేశారు. లతా మంగేష్కర్ 13 సంవత్సరాల వయసులో గాయనిగా కెరీర్ ప్రారంభించింది. ఇప్పటివరకు అన్ని భారతీయ భాషలలో కలిపి 30వేలకుపైగా పాటలను పాడారు.