Lavanya Tripathi: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన లావణ్య త్రిపాఠి.. చూస్తే షాక్
Varun Tej: ఈ మధ్యనే మెగా కోడలు అయిపోయింది అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి. కాగా పెళ్లయిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో ఏదో ఒక తన పెళ్లికి సంబంధించిన పోస్ట్ షేర్ చేస్తూ అభిమానులను ఖుషి చేస్తోంది ఈ హీరోయిన్. కాగా నిన్న షేర్ చేసిన ఇంస్టాగ్రామ్ రీల్ మాత్రం అందరిని షాక్ కి గురిచేసింది .
Viral Video: అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల తార లావణ్య త్రిపాఠి. మొదటి సినిమాతోనే మంచి విజయం సాధించిన ఈ హీరోయిన్ ఆ తరువాత కూడా ఎన్నో సినిమాలలో నటించింది. ఎందుకో తెలియదు కానీ అందం అభినయం రెండున్న ఈ హీరోయిన్ కి తనకు తగినంత స్థాయిలో గుర్తింపు అయితే రాలేదు. కాగా ఈ మధ్య కొన్ని వెబ్ సిరీస్ లో కూడా కనిపించిన లావణ్య ఫైనల్ గా తాను ప్రేమించిన మెగా హీరో వరుణ్ తేజ్ పెళ్లి చేసుకుని మెగా కోడలు అయిపోయింది.
నవంబర్ 1న ఇటలీలో వీరిద్దరి వివాహం ఘనంగా జరిగింది. మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ, లావణ్య ఫ్యామిలీ మధ్య వీరి వివాహ సంబరాలు అంబరాన్ని అంటాయి. ఇక పెళ్లయిన దగ్గర నుంచి వీరిద్దరికి సంబంధించిన ఒక్కో ఫోటో ఒక్కో వీడియో చిన్నగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తోంది లావణ్య. ఈ నేపథ్యంలో ఆమె నిన్న షేర్ చేసిన ఇంస్టాగ్రామ్ రీల్ మాత్రం అందరిని ఆశ్చర్యపరిచింది.
లావణ్య షేర్ చేసిన వీడియోలు ఆమె చాలా హాట్ లుక్ లో కనిపించారు.బ్లూ కలర్ స్లీవ్ లెస్స డ్రెస్ లో.. కొంచెం ఎక్కువ మేకప్ తో.. మత్తు కళ్ళతో చాలా హాట్ ఫోటోలకు ఫోజులిస్తూ ఉన్నటువంటి వీడియోని లావణ్య షేర్ చేశారు.
కాగా అసలు ఈ వీడియోని మొదటిసారి చూసిన వారందరూ పైన లావణ్య పేరు చూస్తే తప్ప తిను లావణ్య అని కనుక్కోలేరు. ఇక ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. ఇది చూసినటువంటి ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలు లావణ్య ఏంటి ఇలా గుర్తుపట్ట లేకుండా మారిపోయింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
Also Read: BRS-BJP Alliance: హంగ్ ఏర్పడితే బీఆర్ఎస్-బీజేపీ పొత్తు ఉంటుందా, అమిత్ షా ఏమంటున్నారు
Also Read: AB De Villiers Team: ఏబీ డివిలియర్స్ దృష్టిలో బెస్ట్ ప్రపంచకప్ టీమ్ ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి