Leo Movie: దళపతి విజయ్ (Vijay) లీడ్ రోల్‌లో నటించిన చిత్రం 'లియో' (Leo.. Bloody Sweet). కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ ఇవాళ వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం తమిళంతో పాటు, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి విడుద‌లైన పోస్టర్ తోపాటు టీజ‌ర్‌, ట్రైల‌ర్‌ల‌కు ఆడియెన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా విజయ్ లియో రిలీజ్ రోజే జవాన్ రికార్డును బద్దలుకొట్టింది. షారుఖ్ జవాన్ మొద‌టి రోజు 15.75 లక్షల టిక్కెట్లు అమ్ముడవ్వగా.. లియో తొలి రోజు 16 లక్షల టిక్కెట్లను విక్రయించిన‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. ఒక్క తమిళంలోనే దాదాపు 13.75 టిక్కెట్లు కాగా.. తెలుగు, హిందీ భాషల్లో 2.10 లక్షల టిక్కెట్లు విక్రయించబడ్డాయి. జవాన్ ఫ‌స్ట్ డే బుకింగ్స్ రికార్డును లియో’బద్దలు కొట్టడంతో విజయ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  


లియో సినిమాను వెబ్‌సైట్లలో అక్రమంగా విడుదల చేయడాన్ని నిషేధం విధిస్తూ.. మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా లియో సినిమా హెచ్‌డీ ప్రింట్‌ను కొందరు లీక్ చేసినట్లు తెలుస్తోంది. లియో మూవీ చిత్రబృందం ఆందోళన వ్యక్తం చేస్తోంది. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రంలో విజయ్‌తో పాటు త్రిష, సంజయ్ దత్, అర్జున్, శాండీ, మిష్కిన్, గౌతమ్ మీనన్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. 


Also read: Leo Movie Leaked: ‘లియో’ టీమ్‌కు భారీ షాక్.. అప్పుడే ఫుల్‌మూవీ ఆన్‌లైన్‌లో లీక్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook