Lokesh Kanagaraj injured: దళపతి విజయ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా లియో. మొదటి షో నుంచి మిక్సడ్ రెస్పాన్స్ సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్స్ పరంగా మాత్రం దూసుకుపోతోంది. తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్,‌తెలంగాణలోనే కాదు కేరళలో కూడా ఈ సినిమాకి అత్యంత వసూలు వచ్చాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేరళ ప్రేక్షకులు ఈ సినిమాని విపరీతంగా ఆకట్టుకోవడంతో ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా లోకేష్ కనగరాజ్ అండ్ మూవీ టీమ్ ఈరోజు కేరళ వెళ్ళింది. కానీ అక్కడ అనుకోని పరిస్థితిల్లో పాలక్కాడ్ లో ఒక మాల్ కి వెళ్లిన లోకేష్ కనగరాజ్ గాయపడినట్టు వెల్లడించారు. 


ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా దర్శకుడు లోకేష్ కాలికి గాయం కావడంతో ప్రమోషన్స్ అర్దాంతరంగా నిలిపివేసి తిరిగి చెన్నైకి బయలుదేరేసారి దర్శకుడు.  లోకేష్ రేపు కూడా కేరళలో కొన్ని ప్రమోషన్ ఈవెంట్స్ కి అటెండ్ కావలసి ఉంది. కానీ ఇలా జరగడం వల్ల డైరెక్టర్ కేరళలో ఇతర ప్రచార కార్యక్రమాలను రద్దు చేసినట్లు తెలుస్తోంది. ఇక లోకేష్ కాలికి పాలక్కాడ్‌లోని అరోమా థియేటర్‌లో గాయం అయినట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని లోకేష్ తన ట్విట్టర్ ద్వారా కూడా తెలియజేశారు. ఇంత ప్రేమను అందించిన కేరళ ప్రజలకు థాంక్స్ అని, కానీ తనకు చిన్న గాయం కావడం వల్ల కొన్ని ప్రమోషనల్ ఈవెంట్స్ అటెండ్ కాకుండా తిరిగి చెన్నైకి వెళ్ళిపోతున్నాను అని పోస్ట్ వేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.


సినిమాను మలయాళంలో రిలీజ్ చేసిన గోకులం మూవీస్ సంస్థ పూర్తి భద్రతా వ్యవస్థలను సిద్ధం చేసినప్పటికీ.. థియేటర్‌లో డైరెక్టర్ లోకేష్ కనగరాజును చూసేందుకు జనం ఎగబడడంతో స్వల్ప తొక్కిసలాట జరిగి ఇలా లోకేష్ కి దెబ్బ తగిలింది అని తెలుస్తోంది.


Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడంటే..?  


Also Read: Bhagavanth Kesari: కాజల్ కి ఆ పాత్ర వేస్ట్ అని ముందే చెప్పాను అంటున్న అనిల్ రావిపూడి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook