Leo Movie Update: దళపతి విజయ్-లోకేశ్‌ కనగరాజ్‌ కాంబోలో తెరకెక్కుస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ 'లియో'. ఇందులో విజయ్ కు జోడిగా త్రిష నటించింది. బాలీవుడ్ సీనియర్ స్టార్ సంజయ్ దత్, అర్జున్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మన్సూర్ అలీఖాన్, మిస్కిన్, మాథ్యూ థామస్ కీలకపాత్రల్లో నటించారు. లియో మూవీని లలిత్ కుమార్, జగదీశ్ పళనిస్వామి నిర్మించారు. మాస్టార్ తర్వాత విజయ్-లోకేష్ కాంబోలో వస్తున్న మూవీ కావడంతో దీనిపై భారీగా అంచనాలే ఉన్నాయి. ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ అక్టోబరు 19న ఆడియెన్స్ ముందుకు రానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా తెలుగు ఆడియెన్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది మూవీటీమ్. ఈ చిత్రం నుంచి వచ్చిన ఫ‌స్ట్ సింగిల్ నా రెడీ సాంగ్ (Naa Ready) ఎంత పెద్ద హిట్ట‌యిందో మనందరికీ తెలిసిందే. తాజాగా ఈ పాట‌ను తెలుగుతో పాటు క‌న్న‌డ‌, మ‌ల‌యాళం హిందీ వెర్ష‌న్‌లో రిలీజ్ చేశారు. ఈ పాటను తమిళంలో విష్ణు ఎడవన్ రాయగా.. దళపతి విజయ్‌, అనిరుధ్‌ రవిచందర్ కలిసి అలపించారు. తెలుగులో ఈ పాటను రేవంత్ పాడాడు. రఘురామ్ లిరిక్స్ అందించాడు. 



లియో సినిమాకు ఓవర్సీస్‍లో ఊహించని స్పందన వస్తుంది. అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో జరుగుతున్నాయి. ట్రైలర్ రిలీజ్ కాకముందే ఓవర్సీస్ లో 40 వేల టికెట్లకుపైగా అమ్ముడుపోయాయి. ఇప్పటికే ఈ మూవీ సెన్షార్ ను పూర్తి చేసుకుంది.  ఈ మూవీకి యూ/ఏ(U/A) సర్టిఫికేట్‌ కూడా లభించింది. రెండు గంటల నలభై నిమిషాల రన్‌టైమ్‌ ఉన్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమా  తెలుగు డబ్బింగ్ హక్కుల కోసం సితార సంస్థ ఏకంగా 21 కోట్లు వెచ్చించడం ట్రేడ్ పండితులను ఆశ్చర్యపరిచింది. 


Also read: OMG 2 Remake: తెలుగులో రీమేక్‌ కానున్న అక్షయ్ ‘ఓ మై గాడ్‌2’.. హీరో అతడేనా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook