LGM Movie on OTT: హరీష్‌ కళ్యాణ్, లవ్‌ టుడే భామ ఇవానా జంటగా నటించిన మూవీ 'ఎల్‌జీఎం'(LGM Movie). టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోని నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకి రమేశ్‌ తమిళ్‌మని దర్శకత్వం వహించారు. ఇందులో నదియా, యోగి బాబు(Yogi Babu), ఆర్జే విజయ్ కీలకపాత్రల్లో నటించింది. జూలై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్సడ్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో వారం తర్వాత ఆగస్టు 4న ఈ మూవీ రిలీజైంది. ఈ సినిమా తెలుగులో పెద్దగా ఆడలేదు. కంటెంట్ దెబ్బ కొట్టడంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ధోనీ భార్య సాక్షీ సింగ్‌ ఈ మూవీకి వీర లెవల్లో ప్రమోషన్స్ చేసింది. తనకు ఇష్టమైన నటుడు అల్లు అర్జున్(Allu Arjun) అంటూ.. చెప్పుకొచ్చింది సాక్షి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రీసెంట్ గా ఈ మూవీ ఓటీటీకలోకి ఎంట్రీ ఇచ్చింది. అమెజాన్‌ ప్రైమ్‌లో మూడు రోజుల కిందట తమిళ వెర్షన్‌లో ఈ సినిమా రిలీజైంది. కాగా తాజాగా తెలుగు వెర్సన్‌ అందుబాటులోకి తీసుకొచ్చారు మేకర్స్. మీరా, గౌతమ్ లవ్ చేసుకుంటారు. గౌతమ్ పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మతో కలిసి ఉండాలనుకుంటాడు. అయితే మీరాకు అది ఇష్టం ఉండదు. ఈ పరిస్థితుల్లో మీరాకు, అమ్మకు మధ్య మంచి రిలేషన్‌షిప్‌ ఏర్పడేందుకు కూర్గ్‌ ట్రిప్ ప్లాన్ వేస్తాడు హీరో‌.  మరి కాబోయే అత్తతో ఇవానా మింగల్ అయ్యిందా లేదా? ఆ తర్వాత జరిగిన పరిణామాలేంటి? అనేది ఈ మూవీ కథ. ధోనీ తొలి సినిమా ప్రయత్నం బెడిసి కొట్టిందనే చెప్పాలి. ఇక నైనా కథల ఎంపికలో ధోని అండ్ టీమ్ జాగ్రత్త పడాల్సి ఉంటుంది. 


Also Read: Baby Movie: కోలీవుడ్ లో రీమేక్‌ కాబోతున్న బేబీ మూవీ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి