LIGER Pre Release Event on 20th August at Guntur: వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ లాంటి సూపర్ హిట్ ఇచ్చి ఫామ్ లో ఉన్న పూరి జగన్నాథ్ విజయ్ తో కిక్ బాక్సింగ్ నేపథ్యంలో సినిమా చేశారు. లైగర్ పేరుతో రూపొందిన ఈ సినిమాల్లో విజయ్ దేవరకొండ ముంబై స్లంలో పెరిగి కిక్ బాక్సర్ గా మారిన కుర్రాడిగా కనిపించబోతున్నాడు. హీరోయిన్ పాత్రలో అనన్య పాండే నటిస్తున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అలాగే అమెరికన్ కిక్ బాక్సర్ మైక్ టైసన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక మకరంద్ దేశ్పాండే వంటి ఇతర స్టార్ నటులు నటిస్తున్న ఈ సినిమాను పూరి కనెక్ట్స్ బ్యానర్ మీద చార్మి కౌర్, పూరి జగన్నాథ్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కరణ్ జోహార్, అపూర్వ మెహతా వంటి వారు నిర్మిస్తున్నారు. అటు విజయ్ దేవరకొండ కెరీర్ లో ఇటు పూరి జగన్నాథ్ కెరీర్ లో మొట్టమొదటి ప్యార్ ఇండియా సినిమా అయిన ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఆగస్టు 25వ తేదీన విడుదల కాబోతోంది.


ఇప్పటికే విజయ్ దేవరకొండ, అనన్య పాండే, పూరి జగన్నాథ్, చార్మి దేశమంతా చుట్టేస్తూ రోజుకొక చోట పర్యటిస్తూ తమ సినిమాను ప్రమోట్ చేసుకునే పనిలో పడ్డారు. ఇక ఈ సినిమా విడుదల దగ్గర పడడంతో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో జరగబోతోంది.


ఆగస్టు 20వ తేదీ అంటే రేపు సాయంత్రం ఐదు గంటల నుంచి ఈ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేశారు. గుంటూరులోని చలపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గ్రౌండ్స్ లో ఈ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మరింత గ్రాండ్ గా చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ద్వారా సినిమా మీద ఒక్కరిగా మరిన్ని అంచనాలు పెంచాలని ప్లాన్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు అని చెప్పక తప్పదు.


Also Read: Liger Movie Censor Report: లైగర్ మూవీ సెన్సార్ రిపోర్ట్.. ఆ బూతు డైలాగ్స్, సైగలకు సెన్సార్ కట్


Also Read: Puri Jagannadh Clarity on Charmee Kaur: ఛార్మీతో రిలేషన్ పై ఓపెన్ అయిన పూరీ.. అసలు విషయం అదే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి