Radhe Shyam LIVE Updates: `రాధేశ్యామ్` మినిట్ టూ మినిట్ అప్డేట్.. లైవ్ అప్డేట్స్ అండ్ రివ్యూ
ఈ రోజే విడుదలైన ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా సందడి ప్రారంభమైంది. థియేటర్ల వద్ద కొనసాగుతున్న ఫ్యాన్స్ సందడి మరియు లైవ్ రివ్యూ మీ కోసం
Prabhas Radhe Shyam Movie review and Live Updates: ఎంతగానో ఎదురుచూస్తున్న డార్లింగ్ సినిమా థియేటర్లలో సందడి ప్రారంభమైంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కింది. ఈ మోస్ట్ అవైటెడ్ లవ్ స్టొరీ మార్చి 11 న ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. నిన్నటి నుండే డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ యేటర్ల ముందు బాణాసంచా, డప్పులు మరియు డ్యాన్స్ లతో సందడి షురూ చేశారు.
సాహూ తరువాత దాదాపు మూడు సంవత్సరాల తరువాత ప్రభాస్ థియేట్లర్లలో పలకరించనున్నాడు. కరోనా కారణంగా చాలా సార్లు వాయిదా పడిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.. ఇప్పటికే విడుదలైన రెండు ట్రైలర్స్, పాటలు, ప్రభాస్ లవర్ బాయ్ లుక్, పూజా హెగ్డే స్టన్నింగ్ లుక్స్ ప్రేక్షకులని ఆకట్టుకోవటమే కాకుండా.. సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.
'జిల్' మూవీ ఫేం రాధాకృష్ణ ఈ సినిమాకి డైరెక్షన్ చేయగా.. కాటీ సీరీస్ & మూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ఈ కృష్ణం రాజు ముఖ్య పాత్ర పోషిస్తుండగా.. అలనాటి తార భాగ్య శ్రీ కూడా కనిపించనున్నారు. థియేటర్ల వద్ద సందడి షురూ అయిన సందర్భంగా రాధేశ్యామ్ సినిమా విశేషాలు, ప్రేక్షకుల రివ్యూ.. లైవ్ మీకోసం...
Latest Updates
రివ్యూ..
మొదటి నుండి సినిమా యూనిట్ చెప్తున్న దాని ప్రకారం.. "ప్రేమ- విధికి మధ్యలో జరిగిన యుద్ధం".. ఓవరాల్ గా విజువల్స్ ఆకట్టుకున్నాయి.. విక్రమ్ ఆదిత్య గా ప్రభాస్, ప్రేరణగా పూజా హెగ్డే ఇద్దరు వారి పాత్రల్లో జీవించేసారు.. థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంది.. ముఖ్యంగా పాటలు.. విజువల్స్ వండర్ గా చెప్పవచ్చు.
తరువాతేమ్ జరిగింది.. ??
సినిమా ప్రారంభంలో చెప్పినట్టు.. "ప్రేమ- విధికి మధ్యలో జరిగిన యుద్ధమే.. రాధేశ్యామ్".. ఎవరు చావును చేరుకుంటారు..?? ఏం జరగనుంది..
కారు యాక్సిండెంట్.. ఆసుపత్రిలో ప్రేరణ..
ప్రేరణకి కారు యాక్సిడెంట్.. లండన్ నుండి రావాలనుకున్న విక్రమ్.. రోమ్ కి షిప్ లో లో ప్రయాణం.. అనుకోని సునామీ.. షిప్ మునిగిపోనుంది.. అక్కడ చావు బ్రతుకుల్లో ప్రేరణ..
ఏం జరగబోతుందో తెలుసుకున్న ప్రేరణ..
అసలేం జరగబోతుందో.. ఇప్పటి వరికి విక్రమ్ ఆదిత్యకి మాత్రమే తెలుసు. కానీ డైరీ చదివిన ప్రేరణకి.. ఆ డైరీలో ప్రేరణ రాసిన దానిని చదివిన విక్రమ్ ఆదిత్యకి ఇద్దరికీ అర్థం అయింది ఇద్దరిలో ఒకరు చావుకు చేరువ అవ్వాలని..
వెన్నెల్లో విక్రమ్ - ప్రేరణ
కమ్మని వెన్నెల్లో.. విక్రమ్- ప్రేరణ.. లవ్ ప్రపోజ్ చేసిన ప్రేరణ.. లండన్ వెళ్లాలి అని చెప్పిన విక్రమ్ ఆదిత్య..
నిన్నెలా- నిన్నెలా సాంగ్
అందరి భవిష్యత్తు చెప్పే విక్రమ్ కి తన భవిష్యత్తు గురించి ముందే తెలుసు.. అందుకే ప్రేరణతో చివరి రోజులా గడిపేస్తాడు.. నిన్నెలా- నిన్నెలా సాంగ్..
ఇంత మంచి అబ్బాయికి ఇంకా పెళ్లేందుకు కాలేదో..??
హాస్పిటల్ లో నుండి ప్రేరణను ఇంటికి తీసుకొచ్చిన విక్రమ్.. మాటల్లో అడిగేస్తుంది.. "ఇంత మంచి అబ్బాయికి ఇంకా పెళ్లేందుకు కాలేదో..?" అని.. అలా సాగుతూ.. విక్రమ్ ఇంట్లోనే డిన్నర్ ముగిస్తారు..
ట్విస్ట్ తో ఇంటర్వెల్..
విక్రమ్ ఆదిత్యతో తిరగొద్దు అని ప్రేరణ పెదనాన్న సూచన.. దూరం అయిన-దగ్గర అయినా మిగిలేది బాధే.. అంటూ ప్రేణనకి సూచన..
ప్రేరణ చెయ్యి చూసి.. కాలం రాసిన చందమామ కథ నీ ప్రేమ.. అందుకోవటం ఒక యుద్ధం: విక్రమ్ ఆదిత్య..
కళ్లు తిరిగి పడిపోయిన ప్రేరణ.. కండిషన్ సీరియస్.. ఇంటర్వెల్
ముద్దుల గురించి చర్చ
ప్రేరణ - విక్రమ్ ఆదిత్య మధ్య 97 ముద్దులు... 100 ముద్దుల గురించి చర్చ..
ఇంటి దగ్గర ప్రేరణను డ్రాప్ చేసిన విక్రమ్...
లవ్ ట్రాక్ షురూ..
ప్రేరణను చూడగానే విక్రమ్ ఆదిత్య పడిపోయాడు.. ప్రేమ ఒద్దు.. ఫ్లర్టేషన్ షిప్ కావాలంటూ.. ఆదిత్య ప్రపోస్
300 కిలోమీటర్లు ప్రభాస్ వర్షంలో ప్రేరణ కోసం వెళ్తాడు.. తరువాత ఏకమై.. సాంగ్..
జగపతి బాబుని కలసిన ప్రభాస్..
ఇండియాస్ రిచెస్ట్ మ్యాన్ జగపతిబాబుని కలిసిన విక్రమ్ ఆదిత్య.. జగపతి బాబు చెయ్యి చూసి.. నీ కళ ఎప్పటికీ నెరవేరదు అని చెప్పిన విక్రమ్.. నచ్చని విక్రమ్ పై జగపతి బాబు మనుషులు దాడి.. కట్ చేస్తే.. ప్రేరణ పని చేస్తున్న హాస్పిటల్ లో జాయిన్ అయిన విక్రమ్ ఆదిత్యపూజా హెగ్డే (ప్రేరణ) ఇంట్రడక్షన్
అందమైన లొకేషన్ లో ప్రేరణ ఇంట్రడక్షన్
రోమ్ ట్రెయిన్ లో విక్రమ్.. ప్రేరణను చూసిన విక్రమ్...
"కలవ కూడని ఇద్దరు కలిశారు.... విడిపోయారు.,.. మళ్లీ కలుస్తారా..." డైలాగ్ తో సాంగ్..
విక్రమ్ ఆదిత్య ఇంట్రడక్షన్
పరమహంస (కృష్ణం రాజు) విక్రమ్ ఆదిత్య గురించి ఇంట్రడక్షన్.. అదిరిపోయిందియూరప్ వెళ్లిన విక్రమ్.. సస్పెన్స్ లో కొనసాగుతుంది..
సంసారి సాంగ్.. సాహూలో కంటే హ్యాండ్సమ్ లుక్స్ తో ప్రభాస్
లవ్ లైన్ లేదని చెప్పిన విక్రమ్.. అప్పుడే
ఇంట్రడక్షన్
రాధేశ్యామ్ సినిమా.. మొదట "ప్రేమకి- విధికి మధ్య జరిగే యుద్ధం" అనే డైలాగ్ తో ప్రారంభం అవుతుంది.. మొదట కృష్ణం రాజ్ భోదిస్తూ బ్యాక్ డ్రాప్ లో టైటిల్స్..
సినిమా దేని గురించో చెప్పేసిన ట్విట్టర్ యూసర్
1. ప్రేమ- త్యాగాన్ని కోరుకునే ప్రేమ..
2. పాల్మీస్ట్రీ - తలరాతని ఎవ్వరు మార్చలేరు..
3. సంకల్పం- ఆత్మ సంకల్పం ఉంటే విధినైనా ఎదురించగలరు..
మస్ట్ వాచ్.. ట్విట్టర్ యూసర్
స్టోరీ లైన్ - 9/10..
CG - 8/10 కొన్ని సార్లు తప్పింది
సంగీతం - 10/10 సినిమాకు ప్రాణం
మొత్తం - 8.5/10 ( చివరి 10 నిమిషాలు కథను ఫాస్ట్ ఫార్వార్డ్ చేసారు.. అది మరింత స్పష్టంగా ఉంటే బాగుండేది..)
ట్విట్టర్ యూసర్ ఓవరాల్ రివ్యూ..
డీసెంట్ - ఫస్ట్ హాఫ్.. అద్భుతం- సెకండాఫ్మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ & పర్ఫెక్ట్ ఎగ్జిక్యూట్ స్టోరీ
విజువల్స్ టాప్ నాచ్.. థమన్ Bgm సూపర్...
రేటింగ్ - 4/5
ట్విట్టర్ యూసర్ రేటింగ్..
రాధేశ్యామ్.. మాస్ + క్లాస్ బ్లాక్‌బస్టర్.. ప్రతి ఒక్కరికి నచ్చే సినిమా.. ప్రభాస్ అభిమానులకు ఇక పండగే..రేటింగ్: 4.75/5
ట్విట్టర్ యూసర్ ఫస్టాఫ్ రివ్యూ..
డీసెంట్ ఫస్టాఫ్.. వాచబుల్ (వీడియో)
ట్విట్టర్ యూసర్ ఫస్టాఫ్ రివ్యూ..
ఫస్ట్ పార్ట్ అదుర్స్.. డైరెక్షన్ ఇస్ సూపర్బ్
ప్రభాస్, పూజా హెగ్డే బెస్ట్ పర్ఫామెన్స్.. సెకండ్ ఆఫ్ కూడా బాగుంటుందని ఆశిస్తున్నా..ట్విట్టర్ రివ్యూ..
థమన్ మ్యూజిక్ సూపర్.. క్లాసీ బ్యాగ్ రౌండ్ మ్యూజిక్.. ఇండియన్ సినిమాలలో డి బెస్ట్ విజువల్స్