NTR`s Daughter Uma Maheshwari Death: ఉమామహేశ్వరి ఇంటికి చేరుకున్న నందమూరి కుటుంబసభ్యులు

Tue, 02 Aug 2022-9:09 am,

NTR`s daughter Uma Maheshwari Death: స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు కుటుంబంలో విషాదం నెలకొంది. ఎన్టీఆర్ చివరి కూతురైన కంఠంనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని తన సొంత నివాసంలో ఇవాళ మధ్యాహ్నం 2.30 గంటలకు ఉమా మహేశ్వరి ఫ్యాన్‌కి ఉరి వేసుకుని చనిపోయారు.

NTR's daughter Uma Maheshwari Death: ఉమామహేశ్వరి ఆత్మహత్యతో నందమూరి కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. నందమూరి తారక రామారావు వారసులు, వారి సంతానం, సమీప బంధువులు ఉమా మహేశ్వరి ఇంటికి చేరుకుంటున్నారు. ఉమా మహేశ్వరి కుటుంబంతో సత్సంబంధాలు కలిగి ఉన్న పలువురు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు సైతం ఉమా మహేశ్వరి ఇంటికి చేరుకుని ఆమె కుటుంబసభ్యులను ఓదారుస్తున్నారు.

Latest Updates

  • Uma Maheshwari Cremation Updates: ఉమా మహేశ్వరి అంత్యక్రియలకు తారక్ రావడం లేదా ?

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ఎన్టీయార్ నాలుగవ కూతురు ఉమా మహేశ్వరి మృతి నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇటీవలే చిన్న కూతురు పెళ్లి చేసిన ఉమా మహేశ్వరి ఇంట్లో ఇక అన్ని ఆనందాలే అని అనుకుంటున్న సమయంలో ఆమే ఇలా ఉన్నట్టుండి అందరికీ షాకిచ్చేలా ఆత్మహత్యకు పాల్పడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఉమా మహేశ్వరి మృతితో నందమూరి కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ఉమా మహేశ్వరి పెద్ద కూతురు, అల్లుడు విదేశాల్లో ఉంటున్నారు. తల్లి మరణ వార్త తెలుసుకున్న ఆమె తన కుటుంబంతో సహా హైదరాబాద్ కి ప్రయాణమయ్యారు. 

    విదేశాల్లో ఉన్న తారక్ పరిస్థితేంటి ?
    భార్య లక్ష్మీ ప్రణతితో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లిన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కి కూడా ఇది తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసే అంశమే. నందమూరి కుటుంబంలో అందరినీ కలుపుకునిపోయే మనిషిగా తారక్ చిన్న వయస్సులోనే మంచి పేరు తెచ్చుకున్నాడు. ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా ముందుండే తారక్ అంటే ఆ ఇంట్లోనూ అందరికీ అభిమానమే. అయితే ప్రస్తుతం విదేశాల్లో ఉన్న తారక్.. మేనత్త ఉమా మహేశ్వరి మృతిపై ఇంకా స్పందించిన దాఖలాలు కనిపించడం లేదంటున్నాయి సినీ వర్గాలు. 

    ఉమా మహేశ్వరి భౌతికకాయానికి ఎల్లుండి బుధవారం జూబ్లీహిల్స్ లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. పెద్ద కుమార్తె, అల్లుడు రాక కోసం ఆమె అంత్యక్రియలను ఎల్లుండికి వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. అందుకు వీలుగా ఉమా మహేశ్వరి భౌతికకాయం నుంచి దుర్వాసన రాకుండా ఉండేందుకు ఉస్మానియా ఆస్పత్రిలోనే ఎంబామింగ్ కూడా చేశారు. మరి ఈలోగా తారక్ తిరిగొచ్చేనా లేదా అనేదే ప్రస్తుతానికి క్లారిటీ లేని విషయం. అయితే, అయిన వారికి ప్రాధాన్యత ఇవ్వడంలో ఎప్పుడూ ముందుండే తారక్ వీలైనంత వరకు రావడానికే ప్రాధాన్యత ఇస్తాడనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. 
     

  • Uma Maheswari Mortal Remains: ఉమా మహేశ్వరి భౌతికకాయం పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులు భౌతికకాయాన్ని ఉస్మానియా ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్‌లోని తమ నివాసానికి చేర్చారు. పోస్టుమార్టం సమయంలో బాలకృష్ణ, నారా లోకేష్ ఉస్మానియా ఆస్పత్రి వద్ద ఉమామహేశ్వరి కూతురు దీక్షిత తోడు ఉన్నారు. ఇదిలావుంటే, మరోవైపు చంద్రబాబు నాయుడు, కళ్యాణ్ రామ్ సహా నందమూరి కుటుంబసభ్యులు, సమీప బంధువులు భారీ సంఖ్యలో ఇప్పటికే ఉమా మహేశ్వరి ఇంటికి చేరుకున్నారు.

  • Uma Maheswari deadbody embalmed: ఉమా మహేశ్వరి భౌతికకాయానికి ఎంబాల్మింగ్ ప్రక్రియ:
    ఉమా మహేశ్వరి కూతురు, అల్లుడు విదేశాల్లో ఉన్నారు. తల్లి మరణవార్త తెలుసుకున్న ఆమె కూతురు అక్కడి నుంచి హైదరాబాద్‌కి బయల్దేరారు. జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో ఎల్లుండి అంత్య క్రియలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఉమా మహేశ్వరి మృతదేహానికి వైద్యులు ఎంబాల్మింగ్ చేశారు.

  • Uma Maheswari Post-mortem: ఉస్మానియా ఆస్పత్రిలో ఉమామహేశ్వరి భౌతికకాయానికి పోస్టుమార్టం పూర్తయింది. ప్రస్తుతం ఆమె భౌతికకాయాన్ని జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసానికి తరలించారు.

  • ఉమా మహేశ్వరి నివాసానికి తరలివస్తున్న నందమూరి కుటుంబసభ్యులు, సమీప బంధువులు, ప్రముఖులు

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

     

  • నందమూరి ఇంట్లో విషాదం.. ఎన్టీఆర్ కూతురు ఉమామహేశ్వరి ఆత్మహత్యతో నందమూరి కుటుంబంలో విషాదచాయలు

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

     

  • Nara Lokesh at Uma Maheshwari's residence: ఉమామహేశ్వరి ఆత్మహత్య గురించి తెలుసుకున్న నారా లోకేష్.. తొలుత హుటాహుటిన జూబ్లీహిల్స్ లోని ఆమె నివాసానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఉమామహేశ్వరి భౌతిక కాయాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారని తెలుసుకుని అక్కడి నుంచి ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లారు. నారా లోకేష్ తల్లి నారా భువనేశ్వరి ఎన్టీఆర్‌కి మూడో కూతురు కాగా.. కంఠంనేని ఉమామహేశ్వరి నాలుగో కూతూరు అనే విషయం తెలిసిందే. అంటే నారా లోకేష్‌కి ఉమామహేశ్వరి చిన్నమ్మ అవుతారన్నమాట.

  • Uma Maheshwari Mortal Remains Sent For Post-mortem: ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు.. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని శవాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురికి తరలించారు. పోస్ట్‌మార్టం అనంతరం ఉమా మహేశ్వరి భౌతికకాయాన్ని తిరిగి జూబ్లీహిల్స్‌లోని ఆమె నివాసానికి చేర్చనున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link