Vijayakanth Passed Away: విజయ్ కాంత్ మరణానికి కారణాలు ఇవే..!

Thu, 28 Dec 2023-1:47 pm,

Vijayakanth Death News Live Updates: సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు కెప్టెన్ విజయ్ కాంత్ ఇకలేరు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం తుది శ్వాస విడిచారు. దీంతో సినీలోకం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

Vijayakanth Death News Live Updates: సినీ నటుడు, డీఎండీకే అధినేత  విజయ్ కాంత్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణవార్తను  తమిళనాడు ఆరోగ్య శాఖ సెక్రటరీ వెల్లడించారు. చెన్నైలోని మియోట్ ఆసుపత్రిలో  చికిత్స పొందుతూ  విజయ్ కాంత్ మరణించారని తెలిపారు. ఇటీవల అనారోగ్యంతో కోలుకున్న ఆయన.. కరోనా బారిన పడడంతో మళ్లీ ఆసుపత్రిలో చేరారు. బుధవారం రాత్రి నుంచి ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నారు. విజయ్ కాంత్  మరణవార్తను అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. పెద్ద ఎత్తున  ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు. 1952 ఆగస్టు  25న జన్మించిన విజయ్ కాంత్.. సినీ, రాజకీయ రంగంలో తనదైన ముద్ర వేశారు. 

Latest Updates

  • Vijayakanth Death News Live Updates: రేపు విజయకాంత్ భౌతికకాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.

  • Vijayakanth Death News Live Updates: నా ప్రియతమ సోదరుడు, నేషనల్ ప్రోగ్రెసివ్ ద్రావిడ సంఘం వ్యవస్థాపకుడు, విలక్షణ నటుడు, తమిళ సినీ సారథి విజయకాంత్ మృతి తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని కమల్ హాసన్ అన్నారు. 

     

  • Vijayakanth Death News Live Updates: విజయకాంత్ మృతితో తమిళనాడు రాష్ట్రం నలుమూలల నుంచి ఆయన అభిమానులు, డీఎండీ కార్యకర్తలు చెన్నైకి చేరుకుంటున్నారు.

  • Vijayakanth Death News Live Updates: ఏదో ఒక రోజు కోలుకుని మళ్లీ కెప్టెన్ యాక్టివ్ అవుతాడని ఆశించాం. విజయ్ కాంత్ మరణం నాలాంటి లక్షలాది అభిమానులను షాక్‌కి గురి చేసింది: శరత్ కుమార్

     

  • Vijayakanth Death News Live Updates: విజయ్ కాంత్ నివాసం వద్దకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చేరుకున్నారు.

    COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

     

     

  • Vijayakanth Death News Live Updates: విజయ్ కాంత్ అంత్యక్రియలు నిర్వహించేందుకు డీఎండీ కార్యాలయంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. తూర్పుపురంలోని కార్యాలయ మెట్ల మార్గంలో ఏర్పాటు చేసిన ర్యాంపుపై విజయకాంత్ భౌతికకాయాన్ని ఉంచనున్నారు.

  • Vijayakanth Death News Live Updates: విజయ్ కాంత్ 27 ఏళ్ల వయసులో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ‘ఇనిక్కుమ్‌ ఇలమై’ అనే సినిమాలో విలన్ రోల్ ప్లే చేశారు. ఇక ఆ సినిమా నుంచి మొదలు 2015లో విడుదలైన సగప్తం చిత్రం వరకు నిర్వీరామంగా సినిమాల్లో నటించారు.  
     

  • Vijayakanth Death News Live Updates: విజయ్ కాంత్ పూర్తి పేరు.. విజయరాజ్ అలగర్‌స్వామి. ఆయన 1952 ఆగస్టు 25లో జన్మించారు. ఆయన 150 పైగా సినిమాల్లో నటించగా.. 20కి పైగా సినిమాల్లో పోలీస్ పాత్రలో మెరిశారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link