Lokesh Kanakaraj:LCUలో విజయ్ సేతుపతి క్యారెక్టర్ రీప్లేస్...అసలు విషయం బయట పెట్టిన లోకేష్
Vijay Sethupathi : కమల్ హాసన్ హీరోగా విజయ సేతుపతి విలన్ గా ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకి వచ్చిన విక్రమ్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి దర్శకత్వం వహించిన లోకేష్ కనగరాజ్ మాట్లాడుతూ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో విజయ్ సేతుపతి పోషించిన సంతానం పాత్రని తన తదుపరి సినిమాలలో రీప్లేస్ చేస్తానని చెప్పుకొచ్చారు.
Lokesh Kanakaraj : కోలీవుడ్ లో డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఖైదీ, విక్రమ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన లోకేష్ ఈ మధ్యనే దళపతి విజయ్ హీరోగా నటించిన లియో సినిమాతో మరొక సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా ఇప్పుడు లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లోని మిగతా సినిమాల కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కమల్ హాసన్ హీరోగా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా విడుదలైన విక్రమ్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని సృష్టించింది. చాలా కాలం తర్వాత కమల్ హాసన్ ఖాతాలో ఒక మరచిపోలేని బ్లాక్ బస్టర్ నమోదు చేసింది ఈ సినిమా. సంతానం పాత్రలో విజయ్ సేతుపతి ఈ సినిమాలో ముఖ్య విలన్ గా కనిపించగా, ప్రముఖ మళయాలం నటుడు ఫాహాధ్ ఫాసిల్ ఈ చిత్రం లో కీలకపాత్ర పోషించారు.
స్టార్ హీరో సూర్య రోలెక్స్ పాత్రలో సినిమా ఆఖరిలో క్యామియో పాత్రలో కనిపించి ప్రేక్షకులకు సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి సంతానం అనే ఒక క్రూరమైన నాయకుడి పాత్రలో కనిపించారు. సినిమా క్లైమాక్స్ లో అతని పాత్ర చనిపోతుంది. అయితే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లోని మిగతా సినిమాలలో కచ్చితంగా ఈ పాత్ర తిరిగి వస్తుంది అని అభిమానులు అనుకుంటూ ఉన్నారు. తాజాగా ఈ పుకార్ల పై డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ రియాక్ట్ అయ్యారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ విక్రమ్ సినిమాతో సంతానం పూర్తి అయిపోయినట్టే అని క్లారిటీ ఇచ్చారు. అయితే సంతానం పాత్రకి బదులుగా విక్రమ్ 2 లో మెయిన్ విలన్ కాబోతున్న రోలెక్స్ పాత్రకి ఒక అసిస్టెంట్ గా మరొక విలన్ పాత్ర ఉంటుందని అన్నారు లోకేష్. సగం నాశనం అయిపోయిన రోలెక్స్ డ్రగ్ ఎంపైర్ ని మళ్ళీ తిరిగి సృష్టించడానికి ఆ విలన్ పాత్ర రోలెక్స్ కి సహాయం చేస్తుందట.
ప్రస్తుతం లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కి సంబంధం లేకుండా లోకేష్ కనగరాజ్ రజనీకాంత్ హీరోగా ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత మళ్లీ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లోని మిగతా సినిమాలను మొదలు పెట్టనున్నారు. ముందుగా కార్తీ తో ఖైదీ 2 సినిమా చేశా
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
క విక్రమ్, లియో సినిమాలకు కూడా సీక్వెల్స్ చేయనున్నారు. ఇక విక్రమ్ 2 సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ కి ఎండ్ గేమ్ లాగా మారుతుంది అని సమాచారం.