Lokesh Kanagaraj:  లోకేష్ కనగరాజ్ తన లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ తో సౌత్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. అంతేకాదు ఈయన తన పవర్ఫుల్ సినిమాలతో అగ్ర దర్శకులలో ఒకరిగా నిలిచారు. తన ప్రస్తుత సినిమా లియో ఫ్లాప్ టాక్ తో కూడా దాదాపు 400 కోట్ల కలెక్షన్స్ సాధించింది అంటేనే ఈ డైరెక్టర్ పైన ప్రేక్షకులకు ఉన్న నమ్మకం చెప్పకనే అర్థం అయిపోతుంది. కాగా లోకేష్ కి తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా ముందుగా మంచి పేరు తెచ్చి పెట్టిన సినిమా కార్తీ హీరోగా చేసిన ‘ఖైదీ’. అంతేకాదు లోకేష్ కానగరాజ్ తన సినిమాటిక్ యూనివర్స్ LCUలో తీసుకొచ్చిన మొదటి సినిమా కూడా ‘ఖైదీ’. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


2019లో విడుదలైన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఆ తరువాత లోకేష్ సినిమాకి యూనివర్స్ లో వచ్చిన విక్రమ్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాలో హీరోగా కమల్ హాసన్ చేయగా, లాస్ట్ క్లైమాక్స్ లో సూర్య కనిపించి మెప్పించారు. ముఖ్యంగా విక్రమ్ సినిమా క్లైమాక్స్ లో ఖైదీ సెకండ్ పార్ట్ కి హింట్ ఇవ్వడం, అలానే ఎల్సీయూలో భాగంగా కార్తీ పాత్రని పరిచయం చేయడంతో సీక్వెల్ పై మరింత అంచనాలు నెలకొన్నాయి. ఇక ఖైదీ రెండో భాగం ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.


ఇక ప్రస్తుతం వచ్చిన లియో సినిమాలో అయితే లోకేష్ పెద్దగా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఏమీ ప్లాన్ చేయలేదు. కేవలం ఎండ్ కార్డులో కమల్ హాసన్ వాయిస్ వినిపించి ఆపేశారు. దీంతో నిరాశకు గురి అయిన లోకేష్ అభిమానులకు ఇప్పుడు ఖైదీ 2 సినిమా గురించి వస్తోన్న ఒక వార్త తెగ ఖుషి చేస్తోంది.
ఏమిటి అంటే ఖైదీ 2లో  LCUలో ఉన్న పాత్రలు అన్ని కనిపించబోతున్నాయని లోకేష్ తెలియజేశాడు. ఖైదీ 2 ఒక పాత్రకి సంబంధించిన సినిమా కాదని, దానిలో విక్రమ్, రోలెక్స్, అమర్, లియో.. ఇలా అన్ని పాత్రలు ఉండనున్నాయని వెల్లడించాడు. ఇక ఈ వార్త విన్న దగ్గర నుంచి ఖైదీ రెండో భాగంపై అంచనాలు మరింత పెరిగాయి. కాగా లోకేష్ ఖైదీ 2 కంటే ముందు రజినీకాంత్ తో ఒక సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమా అయిన తర్వాతే ఖైదీ 2 షూటింగ్ ప్రారంభమై సినిమా విడుదలవుతుంది.


ఇక్కడ మరో విశేషం ఏమిటి అంటే ఒకవేళ రజినీకాంత్ సినిమా కూడా LCUలో భాగంగా తెరకెక్కితే.. రజినీకాంత్ కూడా ఖైదీ 2లో కనిపించే అవకాశం ఉంటుంది. మరి ఖైదీ 2 సినిమాతో లోకేష్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తారో వేచి చూద్దాం.


Also Read: Jio Annual Plans: కొత్తగా జియో ప్రీపెయిడ్ వార్షిక ప్లాన్స్ ఈ ఓటీటీలు ఉచితం


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  


 


 


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook