Rajinikanth Upcoming Movies రజినీకాంత్‌ రాబోయే సినిమా గురించి ఇప్పుడు ఓ వార్త వైరల్ అవుతోంది. రజినీకాంత్ చివరి సినిమా అదే అంటూ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అప్పట్లోనూ ఇలాంటి రూమర్లే వచ్చాయి. మురుగదాస్‌తో చేసిన దర్భార్ మూవీ చివరిదని ప్రచారం జరిగింది. దాని తరువాత రజినీకాంత్ రాజకీయాల్లోకి వచ్చేస్తాడని అన్నారు. కానీ తన ఆరోగ్యం సహకరించడం లేదని రజినీకాంత్ రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ తరువాత మళ్లీ వరుసగా రజినీకాంత్ సినిమాలు చేయడం మొదలు పెట్టాడు. కబాలి, పేట్టా ఇలా ఎన్నో సినిమాలు చేశాడు. కానీ ఏ ఒక్కటి కూడా రజినీ మేనియాకు హిట్టుగా నిలవలేకపోయాయి. అయితే రజినీ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నాడు. నెల్సన్‌తో జైలర్ సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు. తన కూతురు ఐశ్వర్యకు సాయంగా లాల్ సలాం సినిమాలో స్పెషల్ రోల్ పోషిస్తున్నాడు. ఇవి కాకుండా ఇంకో సినిమా కూడా లైన్‌లో ఉంది.


అయితే లోకేష్ కనకరాజ్‌తోనూ రజినీకాంత్‌తో సినిమా ఉంటుందట. మామూలుగా అయితే విక్రమ్ సినిమా తరువాత రజనీకాంత్‌తో లోకేష్ సినిమా చేయాల్సింది. కానీ అది పట్టాలెక్కలేదు. దీంతో విజయ్‌తో లియో సినిమాను ఓకే చేసుకున్నాడు లోకేష్. మరో వైపు రజినీ కూడా తన సినిమాలతో తాను బిజీగా మారిపోయాడు. ఇప్పుడు లోకేష్‌తో రజనీ సినిమా ఫిక్స్ అయినట్టు కనిపిస్తోంది.


Also Read:  Akhil Agent OTT : ఈ వారం ఓటీటీ థియేటర్ మూవీలు.. ఓటీటీలో అయినా అఖిల్ ఓకే అనిపిస్తాడా?


దర్శకుడు, నటుడు మిస్కిన్ తాజాగా కొన్ని విషయాలను చెప్పుకొచ్చాడు. ఇందులో భాగంగా రజినీకాంత్‌ లోకేష్ కనకరాజ్ సినిమా గురించి చెప్పాడు. లియోను పాన్ ఇండియా లెవెల్‌లో ప్లాన్ చేస్తున్నాడని అన్నాడు. ఆ తరువాత రజినీకాంత్‌తో సినిమా చేస్తాడని, సూపర్ స్టారే స్వయంగా పిలిచి మరీ అవకాశం ఇచ్చాడని, లోకేష్ గ్రేట్ అని అన్నాడు. రజినీకాంత్ చివరి సినిమా కూడా అదే కావొచ్చు అని అనుమానం వ్యక్తం చేశాడు మిస్కిన్. అయితే అది చివరి సినిమా కాదని, ఆ తరువాత చిత్రాల గురించి కూడా రూమర్లు వస్తున్నాయని అభిమానులు అంటున్నారు.


Also Read:  Naresh Pavitra Kiss : రెచ్చిపోయిన జంట.. షోలో నరేష్ పవిత్రల ముద్దులు.. బంధం మీద క్లారిటీ వచ్చేసినట్టే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook