Lol Salaam Telugu Webseries: కరోనా వైరస్ వ్యాప్తితో పలు సినిమా షూటింగ్స్ ఆగిపోయాయి. విడుదల పూర్తి చేసుకున్న సినిమాలు సైతం ప్రమోషన్లు లేక, థియేటర్లు మూతపడటంతో వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. దాంతో ఇతర రంగాల తరహాలోనే ప్రత్యామ్నాయ వేదిక ఓటీటీని సినిమా ఇండస్ట్రీ ఆశ్రయించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నాని బండిరెడ్డి తెరకెక్కించిన తాజా వెబ్ సిరీస్ లాల్ సలామ్ నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ఇటీవల రిలీజ్ చేశారు. ఆపై టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ లాల్ సలామ్ టైటిల్ సాంగ్ (LOL Salaam Title Song)ను జూన్ 23న రిలీజ్ చేశాడు. మొత్తం 6 ఎపిసోడ్లతో తెరకెక్కిన లాల్ సలామ్ వెబ్‌ సిరీస్ (LOL Salaam WebSeries) జీ5 ఓటీటీ వేదికగా నేడు విడుదలైంది. జీ5 యాప్ సబ్‌స్క్రైబ్ చేసుకుని ఈ వెబ్ సిరీస్‌ను ఎంచక్కా వీక్షించవచ్చు అని పీఆర్వో బీఏ రాజు టీమ్ తెలిపింది.


Also Read: Jeevitha in MAA Association elections: మా అసోసియేషన్ అధ్యక్ష పదవికి జీవిత పోటీ ?



కొందరు ఆకతాయిలు చేసే సస్పెన్స్ జర్నీ, థ్రిల్లర్ కథాంశంతో దర్శకుడు నాని బండిరెడ్డి లాల్ సలామ్ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాగ ఈ టాలీవుడ్ (Tollywood) వెబ్‌సిరీస్‌కు స్వరాలు సమకూర్చాడు. అర్జున్-కార్తీక్ కథ మాటలు అందించగా, రాకేష్ నారాయణ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించాడు. నేటి నుంచి లాల్ సలామ్ వెబ్‌సిరీస్ జీ5 యాప్‌లో వీక్షించండి.


Also Read: RRR Movie Resumes Shoot: ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ ప్రారంభం, సెట్లో చేరిన తారక్, చెర్రీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook