Varun Tej- Lavanya Tripathi Marriage: మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠీలు త్వరలో వివాహ బంధంతో ఒక్కటికానున్నారు. జూన్‌లో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట త్వరలో పెళ్లి(Varun Tej- Lavanya Tripathi Marriage) పీటలెక్కబోతుంది. ఇప్పటికే పెళ్లి పనులు కూడా స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. వీరు నవంబరు 01న ఇటలీలోని ఓ ప్యాలెస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ వివాహ వేడుకకు కొద్ది మంది సన్నిహితులు మాత్రమే హాజరుకానున్నరని సమాచారం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే గతంలో ఈ జంట షాపింగ్ కోసం పారిస్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరూ హైదరాబాద్‌లోని ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్రా షో రూమ్‌లో కనిపించి సందడి చేశారు. ఈ జంట పెళ్లి డ్రెస్‌ కోసం షాపింగ్‌కు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. 



వరుణ్, లావణ్య తొలిసారి మిస్టర్ సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత వీరిద్దరూ అంతరిక్షం అనే సినిమాలో మెరిశారు. అప్పడు వీళ్ల మధ్య ఏర్పడిన స్నేహం కాస్త ప్రేమగా మారింది. రీసెంట్ గా వరుణ్ తేజ్ గాండీవధారి అర్జునతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆడియెన్స్ ను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం లావణ్య 'థనల్' అనే తమిళ సినిమాలో నటిస్తోంది. రవింద్ర మాధవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అథర్వ మురళి హీరోగా నటిస్తున్నారు. గతేడాది ఈ అమ్మడు 'హ్యాపీ బర్త్ డే' అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకు వచ్చింది.


Also Read: NTR - Sreeleela: తారక్, శ్రీలీల ఫ్యాన్స్ రచ్చ..ఒక్క మాస్ సాంగ్ పడితే ఉంటది భయ్యా!!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook