Lyca Productions offered 100 crores Remuneration for Allu Arjun: 'ఐకాన్ స్టార్' అల్లు అర్జున్ (Allu Arjun) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా హీరో అనే ట్యాగ్‌తో సినిమాల్లోకి వచ్చినా.. ఆ ప్రభావం ఏక్కడా కనపడలేదు. తన నటన, డ్యాన్స్‌తో ఒక్కోమెట్టు ఎక్కుతూ స్టార్ హీరో అయ్యాడు. సినిమా సినిమాకు తనలోని వేరియేషన్స్ చూపిస్తూ   ఐకాన్ స్టార్ అయ్యాడు. సౌత్ ఇండియాలో బన్నీ మూవీస్‌కు మంచి మార్కెట్ ఉంది. ఇక సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా సినిమా 'పుష్ప' (Pushpa)తో అల్లు అర్జున్ మార్కెట్ మరింత పెరిగింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2021 డిసెంబర్ 17న విడుదలైన పుష్ప మొదటి భాగం కరోనా సమయంలోనూ తెలుగులో ఆల్ టైమ్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక హిందీలో కూడా మంచి వసూళ్లు రాబట్టింది. అల్లు అర్జున్‌ తన ఊరమాస్ నటనతో సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లాడు. ఒక్కమాటలో చెప్పాలంటే.. పుష్ప రాజ్ 'వన్ మ్యాన్' షో చేశాడు. పుష్ప భారీ హిట్ కొట్టడంతో అల్లు అర్జున్‌కి ఇప్పుడు సౌత్‌తో పాటు ఉత్తరాది నుంచి కూడా సినిమా ఆఫర్లు వస్తున్నాయి. బాలీవుడ్‌లోని బడా ప్రొడక్షన్ హౌస్‌ల నుంచి మనోడికి ఆఫర్లు వస్తున్నాయట. 


Also Read: Suresh Raina - Srivalli Song: శ్రీవల్లి పాటకు స్టెప్పులేసిన టీమిండియా మాజీ క్రికెటర్.. అస్సలు తగ్గలే కదా (వీడియో)!!


తాజాగా లైకా ప్రొడక్షన్స్ ఓ సినిమా కోసం సైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ని సంప్రదించిందట. స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee)తో సినిమా చేసేందుకు లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) అల్లు అర్జున్‌కి భారీ ఆఫర్ ఇచ్చిందట. ఈ సినిమా కోసం ఏకంగా రూ. 100 కోట్ల పారితోషికం (Allu Arjun Remuneratio) ఆఫర్ చేసిందట. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా అనిరుధ్‌ రవిచందర్‌ని తీసుకుంటున్నారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. తమిళ చిత్ర పరిశ్రమలో అత్యంత విజయవంతమైన దర్శకుల్లో అట్లీ ఒకరు. తేరి, మెర్సల్ మరియు బిగిల్ వంటి భారీ హిట్లను దళపతి విజయ్ కి ఇచ్చాడు. ఒకవేల ఈ కాంబో సెట్ అయితే ఇండస్ట్రీ హిట్ పక్కా కానుంది. 


Also Read: Horoscope Today January 23 2022: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి మిశ్రమ కాలం, అప్రమత్తంగా ఉండాలి!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook