MAA Elections 2021 Bandla Ganesh innovative campaign for MAA elections: మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. త్వరలో జరగనున్న మా ఎన్నికల్లో అధ్యక్ష పీఠం కోసం ప్రకాశ్‌రాజ్‌ (Prakash Raj), మంచు విష్ణు (Manchu Vishnu) మధ్య ప్రధాన పోటీ నెలకొంది. మరోవైపు మా ఎన్నికల్లో జనరల్‌ సెక్రటరీ పదవి కోసం స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతోన్న బండ్ల గణేశ్‌ (Bandla Ganesh) వినూత్న ప్రచారానికి తెర తీశారు. సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్‌ షేర్‌ చేశారు బండ్ల గణేశ్​. ‘ఒకే ఒక్క ఓటు. మా కోసం. మన కోసం. మనందరి కోసం. మా తరఫున ప్రశ్నించడం కోసం’ అని అందులో పేర్కొన్నారు. మా ఎన్నికల్లో మిగిలిన పదవులకు సంబంధించి మీకు ఇష్టం వచ్చిన వారికి ఓటు వేయండి కానీ జనరల్‌ సెక్రటరీగా నన్ను గెలిపించండి’ అని అభ్యర్థించారు బండ్లన్న. ప్రెసిడెంట్‌, వైస్‌ ప్రెసిడెంట్‌, జాయింట్‌ సెక్రటరీతోపాటు మిగిలిన ఎగ్జిక్యూటివ్‌ సభ్యుల విషయంలో మీకు ఇష్టమైన వాళ్లను ఎన్నుకోండి అని గణేశ్ పేర్కొన్నారు. జనరల్‌ సెక్రటరీగా తనను గెలిపించండి అంటూ గణేశ్ ప్రచారం చేస్తున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read : Sarvadarshanam Tickets: హాట్‌కేకుల్లో తిరుమల సర్వదర్శనం టోకెన్లు, కేవలం 35 నిమిషాల్


మొదట ప్రకాశ్‌రాజ్‌ (Prakash Raj) ఏర్పాటు చేసిన ప్యానల్‌లో బండ్ల గణేశ్‌ సభ్యుడిగా ఉన్నారు. కొన్నాళ్లపాటు ప్రకాశ్‌రాజ్‌కు సపోర్ట్ చేశారు బండ్ల. అయితే ప్రకాశ్‌రాజ్‌ టీమ్‌లోకి జీవితా రాజశేఖర్‌ ఎంట్రీ ఇవ్వడంతో... ఆ టీమ్‌ నుంచి బయటకు వచ్చేశారు బండ్ల గణేశ్ (Bandla Ganesh). తర్వాత జీవితపై పోటీ చేయాలనే ఉద్దేశంతోనే జనరల్‌ సెక్రటరీ పదవి కోసం స్వతంత్రంగా బరిలోకి దిగుతున్నారు బండ్ల గణేశ్‌. మొత్తానికి బండ్లన్న పోస్ట్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో (Social Media) వైరల్‌గా మారింది.

 


Also Read : Modi : ప్రపంచ శాంతి కోసం క్వాడ్‌ కూటమి కృషి ‌‌- ప్రధాని మోదీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి