MAA Elections 2021: మా ఎన్నికలకు రంగం సిద్ధం...రేపు ప్యానెల్ ను ప్రకటించనున్న మంచు విష్ణు!
MAA Elections 2021: అక్టోబర్ 10న జరగనున్న మా ఎన్నికల కోసం అధ్యక్ష అభ్యర్థులుగా మంచు విష్ణు, ప్రకాశ్‌రాజ్, సీవీఎల్ నర్సింహరావు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రకాశ్‌రాజ్ తన ప్యానల్‌ని ప్రకటించారు. సెప్టెంబరు 23న విష్ణు తన ప్యానల్ సభ్యులను ప్రకటించనున్నారు. దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
MAA Elections 2021: గత కొంతకాలంగా మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల హాట్ టాఫిక్ గా నిలుస్తున్నాయి. ఈ సారి మా ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. నువ్వా.. నేనా అన్నట్టుగా అభ్యర్థుల మధ్య పోటీ పెరిగింది. ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టిన సభ్యులు సోషల్ మీడియాలో.. మీడియా సమావేశాలలో బహిరంగా విమర్శలు చేసుకుంటున్నారు. మా అధ్యక్ష పదవి కోసం ప్రస్తుతం బరిలో మంచు విష్ణు, ప్రకాష్ రాజ్, బండ్ల గణేష్, సీవిఎల్ ఉన్నారు. అయితే వీరిలో ఎక్కువగా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య గట్టి పోటీ ఉండనున్నట్లుగా తెలుస్తోంది. అయితే మా ఎన్నికల(MAA Elections 2021)లో పోటీ చేస్తున్న అభ్యర్థుల ప్రధాన ఎజెండా.. మా బిల్డింగ్.. ఇదే ప్రధాన అంశంగా అభ్యర్థులు ఇప్పటికే ప్రచారాన్ని కూడా మొదలు పెట్టిన సంగతి తెలిసిందే.
అక్టోబర్ 10న ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో పోలింగ్(Polling) జరగనుంది. అదే రోజు సాయంత్రం దాదాపు 7 గంటల సమయంలో ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే బరిలో ఉన్న ప్రకాష్ రాజ్(Prakash Raj) తన ప్యానెల్ అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా మంచు విష్ణు(Manchu Vishnu) తన ప్యానెల్ సభ్యులను ప్రకటించడానికి సిద్ధమయ్యారు. రేపు (గురువారం) ఆయన తన మా ప్యానెల్‌ను ప్రకటించనున్నారు.
Also Read: Pelli sandaD trailer: దసరాకు హోల్ సేల్ అల్లుడి హంగామా...సూపర్ స్టార్ వదిలిన 'పెళ్లి సందD' ట్రైలర్..
ఇప్పటికే మంచు విష్ణు ప్యానెల్‌లో బాబు మోహన్, రఘుబాబు పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వైస్ ప్రెసిడెంట్‌గా బాబు మోహన్(Babu Mohan), జనరల్ సెక్రెటరీగా రఘు బాబు(Raghu Babu) ఉండునున్నట్లుగా గత కొద్ది రోజులుగా టాక్ నడుస్తోంది. అంతేకాకుండా.. ప్రకాష్ రాజ్ ప్యానల్‌కు ధీటుగా సీనియర్ నటులను సైతం మంచు విష్ణు రంగంలోకి దించనున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి మా ఎన్నికలు రోజు రోజుకీ రసవత్తరంగా మారుతున్నాయి. మరోవైపు, జనరల్ సెక్రటరీ పదవి కోసం ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి జీవిత పోటీ పడతుండగా, బండ్ల గణేశ్(Bandla Ganesh) స్వతంత్రంగా పోటీ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook