MAA Elections : `మా` గొడవలకు తెర వెనుక ఉండి నడిపించే వారే కారణం - రోజా
Actress Roja sensational comments: నటి ఆర్కే రోజా మా ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ మా సారి ఎన్నికలు వాడి వేడిగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. మా ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలిపిస్తున్నాయన్నారు. వ్యక్తిగత దూషణలు చేసుకోవడం బాధాకరమని రోజా అన్నారు.
MAA elections 2021 polling YSRCP Nagari MLA Actress Roja sensational comments on tollywood industry: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు (Movie Artists Association elections) నువ్వా..నేనా అన్నట్లుగానే సాగుతున్నాయి. ఈ మొదటి నుంచీ మా ఎన్నికలు కాస్త ఉత్కంఠగా మారాయి. ఇవ్వాళ ఎన్నికలు ఉదయం కాస్త ప్రశాంతంగా సాగినా తర్వాత కాస్త ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. ఒకరిపై ఒకరు దాడి చేసుకునేలా..వార్నింగ్‌లు ఇచ్చుకునేలా మా ఎన్నికలు మారాయి.
ఇక నటి ఆర్కే రోజా (Roja) మా ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ మా సారి ఎన్నికలు వాడి వేడిగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. మా ఎన్నికలు సాధారణ ఎన్నికలను (general elections) తలిపిస్తున్నాయన్నారు. వ్యక్తిగత దూషణలు చేసుకోవడం బాధాకరమని రోజా అన్నారు. తాము అందరం ఒకే కుటుంబానికి చెందిన వాళ్లమని చెప్పారు. అలాగే రెండు ప్యానల్లలో తనతో పని చేసిన వారు, తెలిసిన వారు ఉన్నారని రోజా చెప్పారు. ఇక మా ఎన్నికల్లో ఎవరు గెలిచినా.. ఎవరు ఓడినా తామంతా కలిసి కట్టుగా ఉండాలని సూచించారు. సమస్యలను ఇరు రాష్ట్రాల సీఎంల (CM) దృష్టికి తీసుకెళ్లాలని సలహా ఇచ్చారు. అందరం కలిసి కట్టుగా ఉండి సమస్యలను పరిష్కరించుకునే దిశగా ముందుకు సాగాలని తాను కోరుకుంటున్నానని రోజా చెప్పారు. కళాకారులకు, ఆర్టిస్ట్‌లుకు (artists) పూర్వ వైభవం రావాలని అభిప్రాయపడ్డారు.
Also Read : MAA Elections polling: ఎవరు బాగా చేస్తారో వాళ్లకే ఓటు వేశా - బాలకృష్ణ
మా ఎన్నికల్లో (MAA elections) ఎప్పుడూ ఇంత ఉత్కంఠ లేదన్నారు. రెండు గ్రూపులుగా విభజించి రెచ్చగొట్టడం బాధాకరమన్నారు. "మా"లో ఈ గొడవలకు వెనుక ఉండి నడిపించే వారే కారణమని రోజా అభిప్రాయపడ్డారు. తెర వెనుక ఉన్న కొందరు పెద్దల వల్ల ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెప్పారు. మా ఎన్నికల్లో పోటీలో ఉన్న అమాయకులు పావులుగా మారారంటూ వ్యాఖ్యానించారు రోజా. మా ఎన్నికల్లో(MAA elections) ఓడిన వారు సైతం గెలిచిన వారికి సహకరించి సినీ ఇండస్ట్రీ (cine industry) కోసం పని చేయాలని రోజా సూచించారు.
Also Read : MAA Elections polling: మా ఎన్నికల్లో ఉద్రిక్తత.. శివబాలాజీ చెయ్యి కొరికిన హేమ