MAA Elections 2021 Tension in MAA elections Hema bites Shivabalajis hand: మా ఎన్నికలు ఉత్కంఠగా సాగుతున్నాయి. మా ఎన్నికల్లో కాస్త ప్రశాంతంగా సాగుతోన్నా కొన్ని ఉద్రిక్తతలు కూడా చోటు చేసుకుంటున్నాయి. మొదట పోలింగ్ కేంద్రంలో ప్రచారం చేస్తున్నారనే విషయంలో మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్‌ వర్గాల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఈ విషయంలో బెనర్జీ పైన (benarji) మోహన్ బాబు (mohan babu) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో తేడా వస్తే సహించనంటూ హెచ్చరించారు. ఇక సమీర్ పైన శివబాలాజీ (siva balaji) ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. వారిద్దరి మధ్య మాటామాటా పెరగడంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది.ఒక నాన్ మెంబర్ వచ్చి లోపల ప్రకాశ్ రాజ్‌కు మద్దతుగా ప్రచారం చేస్తుంటే నరేశ్ పట్టుకున్నారు. అతను ఎవరో తెలుసుకునేందుకు మాస్కు తీయమని అడగ్గా.. అతను బయటకు పరుగులు తీశాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పెద్దగా మారిన ఘర్షణ


ఇక రెండు ప్యానల్స్ మధ్య పలు విషయాల్లో మొదలైన ఘర్షణ కాస్త పెద్దగా మారింది. ఇదే సమయంలో జరిగిన తోపులాటలో శివబాలాజీ చెయ్యిని హేమ కొరికింది. శివబాలాజీ (siva balaji) చెయ్యి కొరికిందంటూ నరేశ్ (naresh) మీడియా ఎదుట చెప్పారు. నో బైటింగ్.. ఓన్లీ ఓటింగ్ అంటూ నరేశ్ అన్నారు. హేమ (Hema) తన చెయ్యి కొరికిందంటూ శివ బాలాజీ కూడా మీడియా ఎదుట స్పష్టం చేశారు. అయితే శివబాలాజీ తనపై చెయ్యి వేస్తే ఎలా ఊరుకుంటానా అని హేమ అన్నారు.


Also Read : Rigging in MAA Elections: మా అసోసియేషన్ ఎన్నికల్లో రిగ్గింగ్, నిలిచిన పోలింగ్


లోపల అంతా అరుపులు కేకలతో గందరగోళం


ఇక ఈ ఘర్షణతో ఏడుస్తూ బయటకు వచ్చిన హేమను విష్ణు (vishnu) ఓదార్చారు. అయితే మా ఎన్నికల కేంద్రంలో జరుగుతున్న పరిణామాలపై పలువురు స్టార్స్ స్పందించారు. లోపల అంతా అరుపులు కేకలతో గందరగోళంగా ఉందని చెప్పారు సుమన్ (Suman). అలాగే రెండు వర్గాల మద్దతు దారులు పోలింగ్ కేంద్ర బయట సైతం ఘర్షణ కు దిగటంతో చిన్నపాటి తోపులాట చోటు చేసుకుంది.


గందరగోళం సృష్టించిన బ్రహ్మానందం


ఇక బ్రహ్మానందం (Brahmanandam) ఓటు వేయడానికి వచ్చిన సమయంలో చాలా గందరగోళం సృష్టించాడని మంచు విష్ణు సరదాగా చెప్పారు. ప్రకాశ్ రాజ్‌ భుజాలపై చెయ్యి వేసి సరదాగా మాట్లాడారు మంచు విష్ణు. హడావిడిగా పరుగెత్తుకొని వచ్చిన బ్రహ్మానందం అందరినీ తోసుకుంటూ ఓటు వేశాడని... కానీ బ్రహ్మానందం తనకు ఓటు వేశారో.. లేదా ప్రకాశ్ రాజుకి (Prakash Raj) ఓటు వేశారో తెలియదంటూ మంచు విష్ణు (Manchu Vishnu) చెప్పారు.


Also Read : MAA Elections 2021 : మా ఎన్నికల్లో అంతరాత్మ ప్రకారం ఓటేశానన్న మెగాస్టార్, ఓటు వేసిన ప్రముఖ స్టార్స్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook