MAA Elections 2021 tollywood hero Megastar Chiranjeevi casts his vote: చాలా రోజుల నుంచి హోరాహోరీగా ప్రచారాలు.. విమర్శలు, ప్రతి విమర్శలతో వాడీవేడిగా మారిన మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా)​  ఎన్నికలు (Movie Artists Association elections) ఆదివారం ప్రారంభమయ్యాయి. హీరో మంచు విష్ణు (Manchu vishnu), నటుడు ప్రకాశ్‌ రాజ్‌ (Prakash Raj) ప్యానెళ్లు పోటీ పడుతున్నాయి. జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌లో మా ఎన్నికలు జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్‌ పోలీసులు (jubilee hills police) కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల కోసం మూడు గదులను కేటాయించి ఒక్కో గదిలో నాలుగు పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. పలువురు ప్రముఖ స్టార్స్ ఇప్పటికే వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

‘మా’ ఎన్నికల్లో తన అంతరాత్మ ప్రకారం అనుగుణంగా ఓటు వేశానన్నారు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi).  పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవని చెప్పారు చిరు. మా ఎన్నికలు ప్రతిసారి ఇంతే వాడీవేడీగా ఎన్నికలు జరుగుతాయని తాను అనుకోవడం లేదని స్పష్టం చేశారు చిరంజీవి. భవిష్యత్‌లో ఇలా జరగకుండా ఉండేందుకు తమ ప్రయత్నాలు చేస్తామన్న మెగాస్టార్ చిరంజీవి... కొందరు షూటింగ్స్‌లో (shootings) బిజీగా ఉండటం వల్ల ఓటు వేయలేకపోవచ్చన్నారు.


Also Read : MAA Elections Polling: ఇలాంటి ఎన్నికల్ని ఎన్నడూ చూడలేదంటున్న పవన్ కళ్యాణ్


పోటీ చేయాలనుకున్నా


మా ఎన్నికల్లో తాను కూడా పోటీ చేయాలనుకున్నానని సినీ నటుడు సాయికుమార్‌ (sai kumar) అన్నారు. అయితే షూటింగ్స్‌తో బిజీగా ఉండటంతో  పోటీ చేయలేదన్నారు. తాను లోకల్‌, నాన్‌-లోకల్‌ కాదని.. నేషనలిస్ట్‌ అని తెలిపారు.


ఓటు వేసిన స్టార్స్


ఇక ఇప్పటికే చాలా మంది ప్రముఖలు ‘మా’ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. చిరంజీవి, బాలకృష్ణ (balakrishna), పవన్ కల్యాన్​ (Pawan Kalyan) ‘మా’ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే రామ్‌చరణ్‌ (ramcharan), సుమన్, మురళీమోహన్ (murali mohan), సుమ, శ్రీకాంత్‌, (srikanth) నరేశ్‌, శివాజీరాజా, ఉత్తేజ్‌, శివబాలాజీ, సుడిగాలి సుధీర్‌, రాఘవ తదితరులు ఇప్పటికే ఓటు వేశారు. 


తాజా ఎన్నికల్లో ఇప్పటికే 50శాతం మంది ‘మా’ సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని సినీ నటుడు నరేశ్‌ తెలిపారు. గతంతో పోలిస్తే ఈ సారి చాలామంది మా ఎన్నికల్లో (MAA Elections) ఓటు వేస్తారని చెప్పారు.


Also Read : Assam: ఒకే జైలులోని 85 మందికి హెచ్ఐవీ పాజిటివ్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook