MAA association elections 2021 latest news: మా అసోసియేషన్ ఎన్నికలు రాజకీయ పార్టీల మధ్య కనిపించే ఎన్నికల వాతావరణాన్ని తలపిస్తుంటుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రతీసారిలాగే ఈసారి కూడా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు సినీ పరిశ్రమలో సినీ ప్రముఖుల మధ్య ఉన్న విభేదాలను బయటపెడుతున్నాయి. మా అసోసియేషన్ అధ్యక్ష్య పదవి కోసం పోటీపడుతున్న వారు తమను తాము హైలైట్ చేసుకుంటూ ప్రత్యర్థులపై ఆరోపణలు, ప్రత్యారోపణలతో విరుచుకుపడుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మా అసోసియేషన్ అధ్యక్ష్య పదవికి పోటీ చేస్తున్న మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్, హేమ హమ్ (Manchu Vishnu, Prakash Raj and Hema) కిసీసే కమ్ నహీ హై అంటూ ప్రస్తుత మా అధ్యక్షుడు నరేష్‌పై, కార్యవర్గసభ్యులపై ఆరోపణలు గుప్పిస్తూనే వారిలో వారు ఒకరిపై మరొకరు మాటల యుద్ధంతో ఎదురుదాడికి దిగుతున్నారు. ఇప్పటివరకు మా ఎన్నికలకు తేదీ ఖరారు కాకపోవడంపై ప్రస్తుత మా అధ్యక్షుడు నరేష్‌పై వస్తున్న ఆరోపణలు ప్రధానమైన ఆరోపణ ఏంటంటే.. ఇప్పుడప్పుడే అధ్యక్షుడు పదవి నుంచి నరేష్‌కి ఇష్టం లేదని, అందుకే మా ఎన్నికలు వాయిదా వేస్తున్నాడు అనే టాక్ వినిపిస్తోంది.


Also read: SarkaruVaariPaata: ఇటు బెల్ట్ టైట్.. అటు ఫాన్స్ అలర్ట్.. అదరగొట్టేసిన మహేష్


ఇదిలావుండగా తాజాగా మా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్న హేమ సైతం నరేష్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. అధ్యక్ష పదవిలో ఇంకొన్ని రోజులు కొనసాగాలనే ఉద్దేశంతోనే నరేష్ మా ఎన్నికలను వాయిదా వేస్తున్నారని ఆరోపించారు. అలాగే, ఇటీవల కాలంలో మా అసోసియేషన్ (MAA association) నిధులను ఏమయ్యాయో తెలియడం లేదన్న ఆమె.. ఆ నిధులు ఏమయ్యాయో లెక్క చెప్పాల్సిన అవసరం ఉందని నరేష్‌ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 


ఫేమస్ జూనియర్ ఆర్టిస్ట్ హేమగా (Junior Artist Hema) పేరున్న ఆమె చేసిన ఈ సంచలన ఆరోపణలపై సీనియర్ హీరో నరేష్ (Actor Naresh) ఏమని స్పందిస్తారో వేచిచూడాల్సిందే మరి. అలాగే ఇకనైనా మా ఎన్నికల తేదీ (MAA elections 2021 date) గురించి ప్రకటిస్తారా లేదా అనేదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.


Also read : షెహనాజ్ గిల్ ఫోటోస్ గ్యాలరీ: తన అందంతో కుర్రకారు మది గిల్లుతున్న షెహనాజ్ గిల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook