Manchu Vishnu : ప్రత్యర్థి ప్యానెల్ వాళ్లు మా విజయాన్ని గౌరవించాలి - మంచు విష్ణు
Vishnu says opposing panel should respect our victory: ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన సభ్యులు మూకుమ్మడి రాజీనామా చేసిన విషయంపై విష్ణు స్పందించారు. ‘‘మా’ ఎన్నికల్లో తాము గెలిచామని, పత్యర్థి ప్యానల్ వారు దాన్ని గౌరవించాలని కోరారు.
MAA Elections Manchu Vishnu Oath Taking Ceremony Vishnu says The opposing panel should respect our victory: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అభివృద్ధికి తాను అన్నివిధాలుగా కష్టపడతానని మంచు విష్ణు (Manchu Vishnu) చెప్పారు. ‘మా’ నూతన అధ్యక్షుడిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత ఆయన మాట్లాడుతూ.. మా ఎన్నికల (MAA Elections) సందర్భంగా తన మేనిఫెస్టోలో (Manifesto) ప్రస్తావించిన ప్రతి అంశాన్ని కూడా అమలు చేస్తానన్నారు.
అలాగే ‘మా’ అభివృద్ధి కోసం అందరం కలిసి కట్టుగా పని చేద్దామని ఆయన ‘మా’ కార్యవర్గానికి పిలుపునిచ్చారు. ఇక ప్రకాశ్ రాజ్ (Prakash Raj) ప్యానల్ నుంచి గెలిచిన సభ్యులు మూకుమ్మడి రాజీనామా చేసిన విషయంపై విష్ణు స్పందించారు. ‘‘మా’ ఎన్నికల్లో తాము గెలిచామని, పత్యర్థి ప్యానల్ వారు దాన్ని గౌరవించాలని కోరారు.
Also Read : Water Pollution: ఆ దేశంలో భూగర్భ జలాల్లో కిరోసిన్, డీజిల్ గుర్తింపు, ఆ నీరు తాగవద్దు
ఎన్నికల్లో తాము విజయం సాధించిన అనంతరం పత్యర్థి ప్యానల్ వాళ్లు రాజీనామాలు చేశారని.. వారి కారణాలు వారికి ఉండొచ్చు అన్నారు. కానీ ఇది చాలా దురదృష్టకరమన్నారు. అయితే మా అభివృద్ధి కోసం తాము అందరినీ కలుపుకునిపోతామని చెప్పారు. మా ఎన్నికల (MAA Elections) సమయంలో తనకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి విష్ణు ధన్యవాదాలు తెలిపారు.
Also Read : Hyderabad Rain : హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం.. Yellow alert జారీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి