MAA President Manchu Vishnu and heros silent on shootings bandh: తెలుగు సినీ పరిశ్రమ స్తంభించింది. ఒక రకంగా తెలుగు సినిమా షూటింగ్స్ ఏమీ జరగడం లేదు. కేవలం ధనుష్, విజయ్ హీరోలుగా నటిస్తున్న తెలుగు -తమిళ సినిమాల షూటింగ్స్ మాత్రమే జరుగుతున్నాయి ఈ విషయంలో మిగతా నిర్మాతలు కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా దిల్ రాజు సహా నాగ వంశీ దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సంగతి పక్కన పెడితే దాదాపుగా తెలుగు సినిమా షూటింగులు నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఇంత జరుగుతుంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల కోసం హోరాహోరీ తలపడి రాజకీయాలను మించి ఫ్లైట్ టికెట్లు వేయించి సభ్యులను రప్పించి గెలిచిన మంచు విష్ణు మాత్రం ఈ విషయంపై ఒక్క కామెంట్ చేయకపోవడం ఆసక్తికరంగా మారింది. మంచు విష్ణు మాత్రమే కాదు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు కానీ ఇతర హీరోలు, నటీనటులు కానీ స్పందించడం లేదు.  నిజానికి మిగతా వాళ్లతో పోలిస్తే ఇప్పుడు ఇబ్బంది పడేది నటీనటులే.


ఎందుకంటే వాళ్లు ఇచ్చిన కాల్ షీట్స్ వేస్ట్ అవుతున్నాయి. వాళ్లు ఇంట్లో ఖాళీగా కూర్చోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఒక్క కాల్ షీట్ వేస్ట్ అయినా తరువాత సినిమాల విషయంలో అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ ఈ విషయంలో మంచు విష్ణు సహా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు కానీ ఈసీ సభ్యులు కానీ అసలు నోరు మెదపకపోవడం ఆసక్తికరంగా మారింది. కేవలం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులే కాదు ఇతర నటీనటులు కూడా నోరు మెదపడం లేదు.


మిగతావాళ్ల సంగతి పక్కన పెడితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటూ సుమారు 900 మందికి ప్రతినిధులుగా ఉన్న మంచు విష్ణు అండ్ టీం స్పందించకపోవడం ఆసక్తికరంగా మారింది. అయితే మంచు విష్ణు స్వయంగా నిర్మాత కావడం, ఈ షూటింగ్స్ నిలిపివేత అంశం మీద ఆయనకి క్లారిటీ ఉండడంతో ఆయన ఈ విషయం మీద స్పందించడం లేదని తెలుస్తోంది. అలాగే మిగతా హీరోలు కూడా స్పందించకపోవడానికి కూడా ఇదే కారణం అని అంటున్నారు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి కొణిదెల ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ ఉంది. అల్లు అర్జున్ అల్లు కాంపౌండ్ కి ఎలాగో గీత ఆర్ట్స్ ఉంది.


మహేష్ బాబుకు సొంతంగా ఘట్టమనేని మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఉంది. ఎన్టీఆర్ ఫ్యామిలీకి ఎన్టీఆర్ ఆర్ట్స్, బాలకృష్ణకు ఎన్బికె ఫిలిమ్స్,  నాగార్జునకు అన్నపూర్ణ బ్యానర్, వెంకటేష్ -రాణా తదితరులకు సురేష్ ప్రొడక్షన్స్ ఉన్నాయి. ఇవి కాకుండా రవితేజ, సందీప్ కిషన్ లాంటి హీరోలు కూడా ఎవరికి వారు తమ తమ ప్రొడక్షన్ హౌసులు ఏర్పాటు చేసుకున్నారు. నిర్మాణం విషయంలో సాధకబాధకాలు అన్నీ తెలిసిన నేపథ్యంలోనే నిర్మాణం వ్యవహారాలలో తాము తలదూర్చకుండా ఉండడం బెటర్ అని భావిస్తున్నారట. ఫుల్ టైం నిర్మాతలుగా ఉన్నవారు తీసుకున్న నిర్ణయానికె తాము కూడా కట్టుబడి ఉంటే బెటర్ అని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది.


Also Read: Actor Chandan Kumar: శ్రీమతి శ్రీనివాస్ తెలుగు సీరియల్ నటుడిపై దాడి.. ఆ మాట చెబుతున్నా వినకుండా!


Also Read: Telugu Movies: ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో రిలీజయ్యే తెలుగు సినిమాలివే



స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook