Naresh strong counter to srikanth: మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్ రోడ్డు ప్రమాదం విషయంలో తనపై కథానాయకుడు శ్రీకాంత్ చేసిన వ్యాఖ్యలకు సీనియర్ నటుడు నరేశ్‌ కౌంటర్ ఇచ్చారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

''నువ్వు సినిమా ఇండస్ట్రీలోకి రావడం, హీరోగా ఎదగడం నేను చూశాను. నేను కూడా ఇండస్ట్రీలో 50 ఏళ్ల నుంచి ఉన్నాను. ఇక్కడే పుట్టి పెరిగాను. మా ప్యానల్‌లో నాకు అపోజిట్ గా పోటీ చేసి ఓడిపోయావు. నాకు ఇండస్ట్రీలో చెడ్డ పేరు లేదు. బైక్‌లు చాక్లెట్లలాగా పిల్లలకు ఇవ్వం. బైక్‌ల విషయంలో జాగ్రత్తలు చెప్పడం తప్పుకాదు. కానీ నీ కామెంట్స్‌తో నేను హర్ట్ అయ్యాను. మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. సాయితేజ్ అతివేగంతో బైక్ నడపలేదు. సాయి ధరమ్ తేజ్‌ది ప్రమాదమే. ప్రమాదంపై చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే వివరణ ఇచ్చాను. ఇంకోసారి బైట్స్ ఇచ్చేటప్పుడు అలోచించి ఇవ్వు'' అంటూ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.


అసలు ఏం జరిగింది?
సాయిధరమ్‌ తేజ్‌(Sai Dharam Tej Accident)కు రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత నటుడు నరేశ్‌(Actor Naresh) స్పందించారు. తన ఇంటి నుంచే సాయితేజ్‌ బయలుదేరి వెళ్లినట్లు చెప్పారు. ఆస్పత్రిలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా వెళ్లి కలవలేకపోయానని, ఇంటికి వచ్చాక వెళ్లి కలుస్తానని చెప్పారు. ‘గతంలో కూడా కోట శ్రీనివాసరావు, బాబూమోహన్‌, కోమటిరెడ్డిగారి కుమారులు ఇలాగే ప్రమాదాలకు గురై, కుటుంబాన్ని శోక సంద్రంలో ముంచెత్తి వెళ్లారు. రానున్న రోజుల్లో బైక్‌లు ముట్టుకోకుండా చేయాలి’ అని నరేశ్‌ అన్నారు. నరేశ్‌ అలా మాట్లాడటం సినీ పరిశ్రమలోని కొందరిని బాధించింది. ఈ క్రమంలోనే సాయితేజ్‌ ప్రమాదం గురించి శ్రీకాంత్‌(Hero Srikanth) మాట్లాడుతూ.. నరేశ్‌ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు.


Also Read: Kangana Ranaut : పరువు నష్టం కేసులో కంగనాకు కోర్టు వార్నింగ్‌! పదే పదే గైర్హాజరైతే అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామని హెచ్చరిక


శ్రీకాంత్ మాటల్లో..


‘‘సాయిధరమ్‌ తేజ్‌కు ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. చాలా చిన్న యాక్సిడెంట్.  ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. నాకు తెలిసి, ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఉన్న యువ కథానాయకుల్లో పరిణతి కలిగిన వ్యక్తుల్లో సాయితేజ్‌(Sai Dharam Tej) ఒకరు. అతను వాహనాన్ని వేగంగా నడిపే వ్యక్తి మాత్రం కాదు. ప్రమాదం గురించి చాలా మంది తమ అభిప్రాయాలను చెబుతున్నారు. వీడియోలు విడుదల చేసే ముందు ఒకటికి రెండుసార్లు చెక్‌ చేసుకుని పెట్టండి. ఎందుకంటే ప్రమాదం జరిగిన వ్యక్తి కుటుంబం తీవ్ర ఆందోళనలో ఉంటుంది. అలాంటి సమయంలో జాగ్రత్తగా మాట్లాడాలి. నరేశ్‌ చనిపోయిన వారి గురించి మాట్లాడకుండా ఉంటే బాగుండేదనిపించింది’’ అని శ్రీకాంత్‌ అనడంతో వీరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook