ధనుష్, సాయి పల్లవి జంటగా నటించిన మారి 2 తమిళ సినిమా అదే టైటిల్‌తో తెలుగులోనూ విడుదలకు సిద్ధమవుతోంది. తమిళ దర్శకుడు బాలాజీ మోహన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా అందించిన మ్యూజిక్ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు ఇంటర్నెట్‌లో సందడి చేస్తుండగా తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ మరో సాంగ్‌ను విడుదల చేశారు.