madhuri dixit Mother : మాధురి దీక్షిత్ ఇంట్లో విషాదం.. కన్నతల్లి మరణంతో
madhuri dixit Mother Death బాలీవుడ్ స్టార్ మాధురి దీక్షిత్ తల్లి కన్నుమూశారు. 91 ఏళ్ల వయసులో ఆమె తుది శ్వాస విడిచారు. ఆమె మరణానికి గల కారణాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. నేడు ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి.
madhuri dixit Mother Death అలనాటి అందాల తార మాధురి దీక్షిత్ కన్నతల్లి స్నేహలతా దీక్షిత్ (91) కన్నుమూశారు. ఆమె మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. నేడు ఆమె అంత్యక్రియలు ముంబైలో నిర్వహించనున్నారు. మాధురి దీక్షిత్‌కు మాతృ వియోగం పట్ల బాలీవుడ్ సంతాపాన్ని వ్యక్తం చేస్తోంది. ఆదివారం తెల్లవారు ఝామున ఆమె తుది శ్వాస విడిచారు. వయోభారం కారణంగానే ఆమె మరణించినట్టు తెలుస్తోంది. నేడు మధ్యాహ్నం ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఆమె ప్రశాంతంగా తనకు ఇష్టమైన వారి మధ్య, వారిని చూస్తే స్వర్గానికి పయనమైంది అంటూ తన తల్లి మరణం మీద మాధురి దీక్షిత్ పోస్ట్ వేసింది. గత ఏడాది తన తల్లి బర్త్ డే సందర్భంగా మాధురి దీక్షిత్ ఇలా పోస్ట్ వేసింది. 'హ్యాపీ బర్త్ డే అమ్మా.. కూతురికి అమ్మే మంచి ఫ్రెండ్ అని అంటుంటారు.. అది నిజమే కదా?. నువ్ నాకోసం చేసినవన్నీ, నాకు నేర్పిన బుద్దులన్నీ కూడా నాకు బహుమతులే. నువ్ ఎప్పుడూ ఆరోరాగ్యాలతో ఉండాలంటూ మాధురి దీక్షిత్ వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది.
మాధురితో ఓ పాట పాడించాలని మేకర్లు అనుకుంటే.. రికార్డింగ్ థియేటర్‌కు తన అమ్మని సైతం తీసుకొచ్చిందట మాధురి. అక్కడే మాధురి తల్లి మంచి సింగర్ అని, ఆమె గొంతు బాగుందని ఆ పాటను ఆమె చేతే పాడించారట.
Also Read: Anupama Photos : అనుపమా.. అందానికి చిరునామా?.. ఎన్ని వింత భంగిమలో.. పిక్స్ వైరల్
Also Read: Ram Charan : పదేళ్లుగా ఎంతో ఎదురుచూశాం!.. తండ్రి కాబోతోండటంపై రామ్ చరణ్ కామెంట్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook