5 మిలియన్లు దాటేసిన మహేష్ ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య
ప్రముఖ టాలీవుడ్ కథానాయకుడు మహేష్ బాబు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. సోషల్ మీడియా ట్విట్టర్ లో 5 మిలియన్ల ఫాలోవర్స్ ను దాటేసి ముందుకు దూసుకెళ్లారు.
ప్రముఖ టాలీవుడ్ కథానాయకుడు మహేష్ బాబు అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. సోషల్ మీడియా ట్విట్టర్ లో 5 మిలియన్ల ఫాలోవర్స్ ను దాటేసి ముందుకు దూసుకెళ్లారు. ఆయన చాలా తక్కువగా సోషల్ మీడియాలో స్పందిస్తుంటారు. తన సినిమా ప్రచారాల కోసం.. ఇతరత్రా కొన్ని ప్రత్యేక సందర్భాలలో మినహాయించి ఆయన సోషల్ మీడియాలో మరెక్కడా రియాక్ట్ అవ్వరు. అయినా సరే ఆయన ట్విట్టర్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. టాలీవుడ్ లో అత్యధిక ట్విట్టర్ ఫాలోవర్స్ ఉన్న హీరోలలో మహేష్ బాబునే బాద్షా.
ట్విట్టర్ లో మహేష్ ఫాలోవర్స్ సంఖ్య 5 మిలియన్ల చేరుకోవడంతో.. ఆయన భార్య నమ్రతా ఇంస్టాగ్రామ్ ద్వారా అభిమానులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది. మహేష్ తో కూడిన ఒక ఫోటోను పోస్టు చేశారు. మహేష్ బాబు ట్విట్టర్ అకౌంట్ ను 2010లో మొదలుపెట్టారు. మహేష్ బాబును ఇంతమంది ఫాలో అవుతున్నా.. ఆయన మాత్రం ఒక్కరినే ఫాలో అవుతున్నారు. ఆయనెవరో కాదు బావ గల్లా జయదేవ్ (గుంటూరు తెదేపా ఎంపీ).
మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న 'భరత్ అనే నేను' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇందులో మహేష్ సీఎం రోల్ లో కనిపిస్తున్నారు. మహేష్ సరసన బాలీవుడ్ నటి కైరా అడ్వాణీ నటిస్తోంది. డీవీవీ దానయ్య చిత్రాన్ని నిర్మిస్తుండగా.. దేవీశ్రీ ప్రసాద్ స్వరాగాలు సమకూరుస్తున్నారు. ఏప్రిల్ 27న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.