Mahesh Babu 18th wedding Anniversary : 18 ఏళ్ల వివాహా బందం.. క్యూట్ పిక్స్ షేర్ చేసిన మహేష్, నమ్రత
Mahesh Babu 18th wedding Anniversary మహేష్ బాబు నమ్రతల పెళ్లి రోజు నేడు (ఫిబ్రవరి 10). అయితే ఇది వారికి పద్దెనిమిదో వివాహా వార్షికోత్సం. ఈ క్రమంలో మహేష్ బాబు, నమ్రతలు అదిరిపోయే ఫోటోలను షేర్ చేస్తూ ఒకరికొకరు విషెస్ చెప్పుకున్నారు. ఇంకా ఎన్నో ఏళ్లు ఇలానే సంతోషంగా కొనసాగాలంటూ ఫోటోలను షేర్ చేశారు. ఇందులో మహేష్ బాబు కాస్త సాధారణమైన ఫోటోను షేర్ చేశాడు. కానీ నమ్రత మాత్రం మోస్ట్ రొమాంటిక్ ఫోటోను వదిలింది. మహేష్ బాబు మీదకు ఎక్కి బలవంతంగా, గట్టిగా ముద్దు పెడుతున్న ఫోటోను షేర్ చేసింది.
మహేష్ బాబు నమ్రతల ప్రేమ వ్యవహారం, డేటింగ్ చేసిన టైం గురించి అందరికీ తెలిసిందే. వంశీ సినిమాతో ఈ ఇద్దరి ప్రేమ చిగురింది. ఆ తరువాత మూడు నాలుగేళ్లు డేటింగ్ చేశారట. ఆ సమయంలోనే హైద్రాబాద్ టు ముంబై చక్కర్లు కొట్టేదట. ఆ సమయంలోనే ఇక్కడి కల్చర్ అలవాటైందని, మహేష్ బాబు ఫ్యామిలీ కూడా దగ్గరైందని, మహేష్ బాబు సిస్టర్‌లతో ఎక్కువగా క్లోజ్ అయ్యానంటూ నమ్రత చెప్పుకొచ్చింది.
ఉమ్మడి కుటుంబం అంటే కష్టమని, పెళ్లైన తరువాత వెంటనే వేరు కాపురం పెట్టాలని మహేష్ బాబుకు ముందే కండీషన్ పెట్టేసిందట నమ్రత. మహేష్ బాబు ఎప్పుడూ కూడా తనను ఒంటరిగా వదిలేయదని, ఒంటరిననే ఫీలింగ్ రానిచ్చే వాడు కాదని, డేటింగ్ చేస్తున్న సమయంలోనూ మహేష్ బాబు చేసే సినిమా షూటింగ్‌లకు వెళ్లేదాన్ని, టైం పాస్ చేసే దాన్నంటూ చెప్పుకొచ్చింది.
ఇక మహేష్ బాబు అయితే తనకు కాబోయే భార్య విషయంలో ఫుల్ క్లారిటీతో ఉండేవాడని, అందుకే సినిమాలకు దూరంగా ఉండాలని ముందే చెప్పాడని, ఫ్యామిలీకే టైం కేటాయించాలని చెప్పేవాడంటూ నాడు జరిగిన విషయాలను నమ్రత చెప్పేసింది. అలా ఇప్పుడు మహేష్ బాబు వెన్నంటి ఉంటూ, సూపర్ స్టార్‌గా ఎదగడంలో నమ్రత ఎంతో సాయపడింది.
Also Read: Sreeleela Latest Photos : శ్రీలీల.. పెడుతోంది గుండెల్లో గోల.. చూస్తే తట్టుకోలేరంతే
Also Read: SSMB 28 Look : మహేష్ బాబు లెటెస్ట్ లుక్.. మరింత తగ్గిపోయాడే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి