Guntur Kaaram USA Premieres:


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహేష్ బాబు సినిమా అంటేనే సినీ అభిమానులకు పండగ. అలాంటి మహేష్ బాబు సినిమా సంక్రాంతికి విడుదలయితే ఇక ఆ హుషారు సినీ అభిమానులలో ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్నో సంవత్సరాల తరువాత మళ్లీ మహేష్ బాబు సంక్రాంతికి తన సినిమాను విడుదల చేస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న గుంటూరు కారం చిత్రం జనవరి 12న విడుదల కానుంది. ఈ చిత్రంపై మొదటి నుంచి అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక ఈమధ్య విడుదలైన పాటలు ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ మరింత పెంచేసాయి.


సంక్రాంతికి గుంటూరు కారంతో పాటు మరో నాలుగు, ఐదు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్న.. ఈ చిత్ర నిర్మాతలు ఈ సినిమా పైన ఎంతో నమ్మకంతో ఉన్నారు. నాగవంశీ మొదటినుంచి ఈ చిత్రం తప్పక బ్లాక్ బస్టర్ అవుతుంది అని చెబుతూనే వస్తున్నారు. నిర్మాతల నమ్మకానికి తగ్గట్టే ఈ చిత్రం విడుదలకు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. అసలు విషయానికి వస్తే యూఎస్ లో మహేష్ బాబు, త్రివిక్రమ్ కి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఇద్దరూ కూడా క్లాస్ ఆడియన్స్ కి ఎంతో ఇష్టమైన వారే. అందుకే మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమాలు యూఎస్ లో రికార్డులు క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఇద్దరూ ఏకంగా కలిసి వస్తూ ఉండటంతో.. యూఎస్ లో గుంటూరు కారం పైన ప్రేక్షకులకు భారీ అంచనాలు ఏర్పడ్డాయి.



ఇక ఈ అంచనాలకు తగ్గట్టే ఈ చిత్రం యుఎస్ఏ లో ప్రీమియర్స్ విషయంలో ఒక సంచలన రికార్డు నమోదు చేసింది. ఈ సినిమాకి సంబంధించి మొత్తంగా యుఎస్ఏ లో జనవరి 11న 5408 కి పైగా స్పెషల్ ప్రీమియర్ షోలని ప్రదర్శించనున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం అఫీషియల్ గా ప్రకటించారు. అయితే ఇంత భారీ స్థాయిలో యుఎస్ఏ లో ప్రీమియర్స్ ప్రదర్శితం అవుతున్న ఏకైక మూవీగా గుంటూరు కారం సంచలన రికార్డు నమోదు చేయడం విశేషం. ఇంతకుముందు ఏ సినిమాకి కూడా ఇంతలా ప్రీమియర్స్ వెయ్యలేదు.


 




 


మహేష్ బాబు, త్రివిక్రమ్ పాపులారిటీ.. అలానే గుంటూరు కారం పై ఉన్న అంచనాలను యుఎస్ఏ డిస్ట్రిబ్యూటర్స్ వినియోగించుకుంటున్నారని, చూడబోతే ఈ సినిమాకి అక్కడ ప్రీమియర్స్ పరంగా అతి పెద్ద నంబర్స్ కలెక్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు.


మహేష్ బాబు హీరోగా…రమ్యకృష్ణ ముఖ్య పాత్రలో కనిపించనున్న ఈ సినిమాని త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తుండగా హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.


Also Read: Ayodhya Rammandir Features: అయోధ్య రామమందిరం ఎలా ఉంటుంది, ప్రత్యేకతలేంటి


Also Read: Guntur Kaaram Update: 'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ ఈవెంట్ ర‌ద్దు.. కారణం ఇదే!


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి