SSMB28 Movie Title Announcement: మహేష్ బాబు ఫ్యాన్స్‌కి త్వరలోనే గుడ్ న్యూస్ రానుందా అంటే అవుననే తెలుస్తోంది. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న SSMB28 ప్రాజెక్ట్ టైటిల్ గురించి ఇప్పటివరకు సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు, చర్చలు నడిచాయి. ఏవేవో పేర్లు కూడా తెరపైకొచ్చాయి కానీ ఇప్పటివరకు అసలు టైటిల్ ఏంటనేది మాత్రం ఎక్కడా క్లారిటీ లేదు. కానీ తాజాగా ఫిలింనగర్ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం.. మహేష్ బాబు సినిమాకు టైటిల్ ఖరైరనట్టు తెలుస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మహేష్ బాబు అభిమానులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అప్‌డేట్ ఏదైనా ఉందా అంటే అందులో ముందుండే అంశం ఇదే. SSMB28 ప్రాజెక్ట్ టైటిల్ వెల్లడిస్తారేమోనని మహేష్ బాబు ఫాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మహేష్ బాబు సినిమా పేరు ప్రకటించాల్సిందిగా కోరుతూ అనేక సందర్భాల్లో మహేష్ బాబుకి, దర్శకుడు త్రివిక్రమ్‌కి, చిత్ర నిర్మాతలకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా రిక్వెస్టులు కూడా పెడుతున్నారు. ఇంకొన్ని సందర్భాల్లోనైతే ఏకంగా ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ కూడా ఇంటర్నెట్లో సందడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే SSMB28 మేకర్స్ టైటిల్‌ని ప్రకటించేందుకు ముహూర్తం సిద్ధం చేసినట్టు సమాచారం అందుతోంది.


ఫిలింనగర్ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం.. ఉగాది రోజున.. అంటే మార్చి 22న ఈ మూవీ టైటిల్‌ని అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఉగాది పండగ అంటేనే తెలుగు వారికి కొత్త సంవత్సరాన్ని తీసుకొచ్చే పర్వదినం కావడంతో ఆ రోజున ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్టు టాక్. అతి త్వరలోనే దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఓ అధికారిక ప్రకటన కూడా వెలువడనున్నట్టు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఒకరకంగా మహేష్ బాబు ఫాన్స్‌కి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఉగాది పండగ వేళ కొత్త అప్‌డేట్‌తో సూపర్ స్టార్ ఫ్యాన్స్ పండగ చేసుకోనున్నారు.


ఇది కూడా చదవండి : Ram Charan in America: అందరికంటే ముందు ఆ గుడ్ న్యూస్ తారక్‌కే చెప్పా


ఇది కూడా చదవండి : SRK Follows 6 People: షారుఖ్ ఖాన్ ఫాలో అవుతున్న ఆ ఆరుగురు ఎవరో తెలుసా ?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook