Mahesh Babu Beauty Secret Revealed : సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులందరికీ పలకరించి మరోసారి త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఆయన త్రివిక్రమ్ తో అతడు, ఖలేజా వంటి సినిమాలు చేయడంతో ఇప్పుడు త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా మీద అందరికీ మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే సినిమా షూటింగ్ కి కాస్త గ్యాప్ దొరకడంతో ఆయన ఇప్పటికే వరల్డ్ టూర్ లో ఉన్న తన ఫ్యామిలీతో జాయిన్ అయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నిజానికి మహేష్ షెడ్యూల్ ఎప్పటికీ ఫ్రీ అవుతుందో తెలియని నేపద్యంలో నమ్రత తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని చాలా రోజుల క్రితమే విదేశాలకు వెళ్లి అక్కడి నుంచి ఒక సమ్మర్ వరల్డ్ టూర్ ప్లాన్ చేసుకున్నారు. అయితే అప్పటికి బిజీగా ఉన్న మహేష్ బాబు ఈ మధ్య కాలంలో ఖాళీ అయిన వెంటనే విదేశాలకు వెళ్లిపోయారు. ఈ నేపధ్యంలోనే విదేశాలకు వెళ్ళిన సమయంలో కొందరు వరల్డ్ ఫేమస్ డాక్టర్స్ ని మహేష్ బాబు కలుస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.


ఇదీ చదవండి: Tamannaah Skin Secret: బయటపడ్డ తమన్నా బ్యూటీ సీక్రెట్.. ముఖానికి ఏమి రాసుకుంటుందో తెలిస్తే యాక్ ఛీ అంటారు!


ఈ విషయాన్ని స్వయంగా మహేష్ బాబు తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో అది నిజమేనని తేలింది. తాజాగా డాక్టర్ హారి కోనిగ్ తో మహేష్ బాబు దిగిన ఫోటో వైరల్ అవుతుంది. అయితే ఈ డాక్టర్ హెల్త్ అండ్ బ్యూటీ ఎక్స్పర్ట్ కావడం ఆయన హాలిస్టిక్ నేచురోపతి, మానసిక ప్రశాంతత, మంచి ఆహారం అలవాట్ల ద్వారా ఆరోగ్యంగా అందంగా ఎలా ఉండాలో సూచించే నిపుణుడు కావడం గమనార్హం. జర్మనీ దేశానికి చెందిన డాక్టర్ హారి కోనిగ్ తో మహేష్ బాబు ఫోటో చూసిన అందరూ మహేష్ బాబు తన అందాన్ని మరింత పెంచుకోవడానికి, వయసు తగ్గించుకోవడానికి ఈ డాక్టర్ని కలిసి ఉండవచ్చని అంటున్నారు.


ఆయన విదేశాలకు వెళ్ళేది బహుశా ఇలాంటి డాక్టర్లను కలిసి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఎలాంటి ఫుడ్ తీసుకుంటే వయసు వచ్చినా కనపడదు అనే విషయాలు తెలుసుకుంటారేమో అంటూ ఇప్పుడు కామెంట్లు వినిపిస్తున్నాయి. నిజానికి మహేష్ వయసు 47 సంవత్సరాలైనా ఆయన 30 సంవత్సరాల యువకుడు అంటే అందరూ నమ్మేస్తారు అంతలా ఆయన డైట్ మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. ఈ విషయంలో మీ ఉద్దేశం ఏంటో కింద కామెంట్ చేయండి.


ఇదీ చదవండి: Dasara Real Story: దసరా కధ నిజంగానే అక్కడ జరిగిందట.. మరీ ఇంత అరాచకమా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook