Kurchi Tata: గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడత పెట్టి సాంగ్ ఎంత సెన్సేషన్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ పాటకి మొదటి నుంచి ఎక్కువ హైప్రాదానికి కారణం కుర్చీ మడత పెట్టి అనే పదమే. ఆ పదాన్ని సృష్టించిన వ్యక్తి కుర్చీ మడత పెట్టి తాత. ఈ తాత అసలు పేరు అహ్మద్ షాషా. అయితే ఆయన పేరు కన్నా కుర్చీ తాత అనే ఎక్కువ పాపులర్ అయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కుర్చీ మడతపెట్టి అంటూ సోషల్ మీడియాను షేక్ చేసిన ఈ తాతను ఇప్పుడు హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారనే విషయం వెలుగులోకి వచ్చింది. వైజాగ్ సత్య ఫిర్యాదు మేరకు ఈ కుర్చీ తాతని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.


యూట్యూబ్ లో అందరిని బూతులు తిడుతూ ఈ తాత పెట్టే వీడియోలు బాగా పాపులారిటీ తెచ్చుకున్నాయి. ఆ బూతు వీడియోలు నుంచి కుట్టిన పదమే ఈ కుర్చీ మడత పెట్టి కూడా. కాగా సత్య కథనం ప్రకారం కుర్చీ తాత తనను బూతులు తిడుతూ వీడియోలు పెడుతున్నాడని.. తన డబ్బులు కాజేసి వైజాగ్ పారిపోయానని నోటికొచ్చినట్టు తిడుతున్నాడని అందుకే పోలీసు స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చినట్టు చెప్పాడు వైజాగ్ సత్య.


మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో ‘కుర్చీ మడత పెట్టి’ సాంగ్ కి గాను కుర్చీ తాత డైలాగ్‌ను వాడికున్నందుకు.. మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. ఆయన్ని ఇంటికి పిలిపించుకుని ఆర్ధిక సాయం అందించారు. అయితే వైజాగ్ సత్య సాయంతో తమన్‌ని కలిశాడు కుర్చీతాత. వైజాగ్ సత్య వల్లే తనకి గుర్తింపు వచ్చిందని చెప్పిన కుర్చీ తాత.. ఆ తరువాత సత్య కే రివర్స్ అయ్యారు. వైజాగ్ సత్య.. తన పేరు.. పాపులారిటీ ఉపయోగించుకుని డబ్బులు సంపాదిస్తున్నాడని.. అతను కనిపిస్తే నరికేస్తా.. చంపేస్తా అంటూ బెదిరిస్తూ వీడియోలు షేర్ చేయడంతో వైజాగ్ సత్య .. కుర్చీ తాతపై కంప్లైంట్ ఇచ్చాడు. ఇక ఈ వీడియో.. ఆ తరువాత తనను తిడుతూ చేసిన కొన్ని వీడియోలు.. చూసిన సత్య పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా.. బుధవారం నాడు ఈ తాతని అరెస్ట్ చేశారు పోలీసులు.


Read: Ayodhya Crown: అయోధ్య రాముడికి స్వర్ణ కిరీటం.. వజ్రాలు, విలువైన రాళ్లు పొదిగినది ఎన్ని కోట్లు అంటే?


Also Read: BRS Party MLAS Meet Revanth: బీఆర్‌ఎస్‌ పార్టీలో కలకలం.. సీఎం రేవంత్‌ను కలిసిన నలుగురు ఎమ్మెల్యేలు


 



 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook