Ravi Teja on Konda Surekha Comments: అక్టోబర్ రెండవ తేదీన బుధవారం నాడు తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంతపై చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపుతున్నాయి. సమంత , నాగచైతన్య కేటీఆర్ వల్లే విడిపోయారంటూ కామెంట్లు చేసిన ఈమె అక్కడితో ఆగకుండా సమంతాను పక్కలోకి పంపించాలని కేటీఆర్ అడిగాడు అంటూ మరో సంచలన కామెంట్లు చేసింది.  దీంతో సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ను మొదలుకొని యంగ్ టైగర్ ఎన్టీఆర్, నేచురల్ స్టార్ నాని, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రవితేజ , డైరెక్టర్ హరీష్ శంకర్, మహేష్ బాబు, చిరంజీవి ఇలా పలువురు సెలబ్రిటీలు ఈ విషయంపై స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఇందులో భాగంగానే మహేష్ బాబు.. సమంతకు అండగా.. కొండా సురేఖ  సమంతపై చేసిన కామెంట్లకు తాజాగా ఒక సుదీర్ఘ ట్వీట్ చేసారు. 


మహేష్ బాబు తన ట్విట్టర్ ఖాతా ద్వారా.. మంత్రి కొండా సురేఖ మా సినీ ప్రముఖులపై మీరు చేసిన వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయి. ఒక కూతురికి తండ్రిగా,  భార్యకు భర్తగా, తల్లికి కొడుకుగా ఒక మహిళా మంత్రి మరో మహిళపై చేసిన ఆమోదయోగ్యం కాని వ్యాఖ్యలు,  భాష పట్ల తీవ్ర వేదనకు గురయ్యాను. ఎదుటివారు మనోభావాలు దెబ్బ తినకుండా ఉన్నంతవరకు వాక్ స్వేచ్ఛను వినియోగించుకోవచ్చు. మీరు చేసిన చౌకబారు నిరాధారమైన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.  సినీ వర్గాన్ని చులకనగా చూడవద్దు అని పబ్లిక్ డొమైన్ లోని వ్యక్తులను అభ్యర్థిస్తున్నాను. మనదేశంలోని మహిళలను,  మన సినీ సోదరులను గౌరవంగా చూడాలి అని నేను అభ్యర్థిస్తున్నాను అంటూ మహేష్ బాబు  ట్వీట్ చేశారు. 


 



ఇక మహేష్ బాబు తో పాటు సీనియర్ స్టార్ హీరోయిన్ రవితేజ,  డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా స్పందించారు. రవితేజ తన ట్విట్టర్ ఖాతా ద్వారా.. రాజకీయ యుద్ధం పేరుతో గౌరవప్రదమైన వ్యక్తిపై నీచమైన ఆరోపణలు చేస్తూ ఓ మహిళా మంత్రి పైశాచిక తంత్రాలను ప్రయోగించడం నన్ను ఆశ్చర్యపరిచింది. ఇది అవమానానికి మించినది. తమ రాజకీయ శత్రుత్వాల్లోకి అమాయకపు వ్యక్తులను,  ముఖ్యంగా మహిళలను ఎవరు లాగకూడదు. నాయకులు సానుకూలంగా వ్యవహరించాలి. సామాజిక విలువలను పెంచాలే కానీ వాటిని తగ్గించకూడదు అంటూ రవితేజ ట్వీట్ చేశారు.


ఇక డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా తన ట్విట్టర్ ఖాతా ద్వారా.. అక్కినేని నాగార్జున కుటుంబం పై కొండా సురేఖ మాట్లాడిన తీరు చాలా బాధాకరం. రాజకీయ ప్రయోజనాల కోసం సినిమా వారిని టార్గెట్ చేయడం సూచనీయం రాష్ట్రాలకు ఎప్పుడు ఏ విపత్తు వచ్చినా మేమున్నామంటూ ముందుకు వచ్చేసి, సినిమా వారిని ఇలా చులకన చేస్తూ మాట్లాడడం చాలా తప్పుడు సాంప్రదాయం.. సురేఖ.. ఇది మీరే మొదలుపెట్టింది దీన్ని సంస్కారవంతంగా ముగించాల్సిన బాధ్యత కూడా మీదే అంటూ హరీష్ శంకర్ ట్వీట్ చేశారు. మొత్తానికి అయితే సినీ సెలబ్రిటీలపై మంత్రి చేసిన తీరుకు అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు.


Also Read: Nani: కొండా సురేఖ వ్యాఖ్యల దుమారం.. ఖండఖండాలుగా ఖండించిన హీరో నాని


Also Read: Naga Chaitanya: మీ మాటలు బాధను కలిగించాయి.. చాలా సిగ్గునీయం: కొండా సురేఖపై నాగ చైతన్య ఫైర్‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి